For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగళూరు టాప్, హైదరాబాద్ సెకండ్: సౌతిండియా రియాల్టీ అదుర్స్

|

కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడిన వాటిలో రియాల్టీ రంగం కూడా ఉంది. రెండో అర్ధ సంవత్సరం నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. రియాల్టీ రంగం కూడా క్రమంగా మెరుగుపడుతోంది. ప్రధానంగా దక్షిణాది నగరాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు వేగంగా రికవరీ అవుతున్నాయని, రికవరీలో బ్యాక్‌బోన్‌గా నిలబడుతున్నాయని మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్స్ సర్వీసెస్ సర్వే వెల్లడించింది. ఈ నగరాల్లోని సీరియస్ ప్రాపర్టీ సెల్సర్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్: వాట్సాప్‌ను దాటేసిన టెలిగ్రామ్, దూసుకొచ్చిన సిగ్నల్ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్: వాట్సాప్‌ను దాటేసిన టెలిగ్రామ్, దూసుకొచ్చిన సిగ్నల్

బ్యాక్ టు మార్కెట్... మరింత పెద్ద ఇళ్లు

బ్యాక్ టు మార్కెట్... మరింత పెద్ద ఇళ్లు

దక్షిణాది నగరాల్లో రవాణా, మెట్రో కనెక్టివిటీ ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ సేల్స్ పెరగడానికి దోహదపడినట్లు తెలిపింది. ఎందుకంటే కొనుగోలుదారులు సరసమైన ధరలతో పాటు కనెక్టివిటీని పరిగణలోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రాపర్టీ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో రియాల్టీ వ్యాపారులు, ఇతరులు దీనిని సొమ్ము చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. మ్యాజిక్ బ్రిక్స్ ప్రాపర్టీ బయ్యర్స్ సెంటిమెంట్ సర్వే(2020) ప్రకారం బయ్యర్స్ తిరిగి మార్కెట్ పైన దృష్టి సారించారు. అంతేకాదు, చాలామంది మరింత పెద్ద ఇళ్ల కోసం చూస్తున్నారు.

కొనుగోలు ఖర్చులు తగ్గడంతో..

కొనుగోలు ఖర్చులు తగ్గడంతో..

వడ్డీ రేటు తగ్గడం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, డెవలపర్లు వివిధ పథకాల ద్వారా ప్రయోజనాలు కల్పించడంతో కొనుగోలు ఖర్చులు తగ్గాయి. దీంతో కొనుగోలుదారులు పెద్ద ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది చిన్న ఇళ్లు విక్రయించి, అప్ గ్రేడ్ హోమ్స్ కోసం చూస్తున్నారు. గత ఆరేడు నెలల కాలంలో వడ్డీ రేట్లు బయ్యర్ సెంటిమెంటును బలపరిచింది. చాలామంది గృహ యజమానులు తమ ప్రాపర్టీ విక్రయానికి డిజిటల్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

బెంగళూరు ఫస్ట్, హైదరాబాద్ సెకండ్

బెంగళూరు ఫస్ట్, హైదరాబాద్ సెకండ్

గృహ విక్రయాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత చెన్నై, పుణే, ముంబై నగరాలు ఉన్నాయి. సులభమైన రవాణా, మెట్రో కనెక్టివిటీ మెరుగ్గా ఉండటమే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాపర్టీ విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణాలని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. సరసమైన గృహాలతో పాటు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపర్టీల మీదే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. 500ల కంటే ఎక్కువ నగరాల్లో మ్యాజిక్ బ్రిక్ ఓనర్ సర్వీసెస్ సేవలను వినియోగించుకుంటున్నారు.

English summary

బెంగళూరు టాప్, హైదరాబాద్ సెకండ్: సౌతిండియా రియాల్టీ అదుర్స్ | South Indian cities have the most serious property sellers in real estate market

With South India leading the revival in India’s real estate market, homeowners of Bengaluru, Hyderabad, and Chennai have emerged as the most serious sellers, according to the latest consumer data of Magicbricks’ Owner Services.
Story first published: Tuesday, February 9, 2021, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X