For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ పే యూజర్స్‌కు గుడ్‌న్యూస్, ఆన్‌లైన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్

|

మీరు గూగుల్ పేను ఉపయోగిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను(FD) బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది గూగుల్ పే. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. గూగుల్ పే ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్స్ బుక్ చేసుకునేందుకు తమ కస్టమర్లకు అనుమతించడానికి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లను(API) అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది ఫిన్‌టెక్ సేతుతో ప్రముఖ సెర్చింజన్ గూగుల్ జత కట్టింది.

దీంతో గూగుల్ పే కస్టమర్లకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు FDలను ఒక ఏడాది వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ FDలకు పొందే గరిష్ట వడ్డీ రేటు 6.35 శాతంగా ఉంటుంది. అయితే ఈ FD సదుపాయం పొందాలనుకునేవారు వన్ టైమ్ పాస్ వర్డ్ ద్వారా ఆధార్ ఆధారిత కేవైసీని పూర్తి చేయవచ్చు. API బీటా వర్షన్ ఏడు రోజుల నుండి 29 రోజులు, 30 రోజుల నుండి 45 రోజులు, 46 రోజుల నుండి 90 రోజులు, 91 రోజుల నుండి 180 రోజులు, 181 రోజుల నుండి 364 రోజులు, 365 రోజులు సహా వివిధ కాలపరిమితిల పైన FDలను అందిస్తోంది. వడ్డీ రేట్లు 3.5 శాతం నుండి ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు 6.35 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

 Soon, You can open fixed deposits on Google Pay

గూగుల్ పేకు దేశంలో 1.50 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్స్‌ను కలిగి ఉంది. అధిక వడ్డీ పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను అందించేందుకు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిన్‌టెక్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నియో, ఫ్రీయో వంటి ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యమై సేవింగ్స్ ఖాతాల్లో రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్‌కు 7 శాతం నుండి వడ్డీ రేట్లు అందిస్తుంది.

English summary

గూగుల్ పే యూజర్స్‌కు గుడ్‌న్యూస్, ఆన్‌లైన్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ | Soon, You can open fixed deposits on Google Pay

According to a report Soon, Google Pay users will be able to book fixed deposits (FDs) online through its fintech partner.
Story first published: Friday, August 27, 2021, 9:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X