For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Jobs: భారతీయులే కావాలంటున్న IT కంపెనీ.. 9,000 మంది నియామకం.. ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు..!

|

IT Jobs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలకు ఉద్యోగుల విషయంలో మెుదటి ఎంపిక భారతదేశం. తమ కంపెనీ అవసరాల కోసం ఎక్కువగా మనపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వంటి వెసులుబాట్లు అందుబాటు ఉండటం మరింతగా కలిసి వస్తోంది.

 9,000 ఉద్యోగాలు..

9,000 ఉద్యోగాలు..

దేశంలోని టైర్ II, టైర్ III నగరాల్లోని ప్రతిభను వెలికితీసే ఉద్దేశ్యంతో గ్లోబల్ కస్టమర్ సర్వీస్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ [24]7.AI తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 'వర్క్ ఫ్రమ్ ఎవర్నీ ఆప్షన్స్'తో భారతదేశం అంతటా 9,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోందని తెలియజేసింది. తన అంతర్జాతీయ క్లయింట్స్ కి వాయిస్, చాట్ ప్రక్రియలన్నింటిలో ఈ నియామకాలు ఉండనున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం అవసరాల కోసం నియామకాలు చేసుకుంటున్నట్లు వెల్లడించింది.

దేశంలో టాలెంట్..

దేశంలో టాలెంట్..

దేశంలో మంచి గుర్తింపు పొందిన టాలెంట్ పూల్ ఉందని ఇండియా అండ్ అమెరికా HRD హెడ్, నీనా నాయర్ చెప్పారు. ఇండస్ట్రీలో అగ్రగామిగా అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. మానవ వనరులపై వెచ్చించటం ద్వారా ఫ్రెషర్‌లను నాయకులుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. గత సంవత్సరం కంపెనీ తన వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో భారత్ నుంచి 5,000 మందిని నియమించుకున్నట్లు తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కస్టమర్ అనుభవాలను అందించడం లక్ష్యంగా కంపెనీ పనిచేస్తోంది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన CCW ఎక్సలెన్స్ అవార్డ్స్‌లో కంపెనీ ఇటీవల "BPO ఆఫ్ ది ఇయర్" అవార్డును అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్ ఈవెంట్ అయిన కస్టమర్ కాంటాక్ట్ వీక్ ద్వారా ఈ అవార్డును కంపెనీకి అందించారు. కంపెనీ నియామకాల కోసం అధికారిక వెబ్ సైట్ లోని కెరీర్స్ ఆఫ్టన్ ద్వారా ఔత్సాహికులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

English summary

IT Jobs: భారతీయులే కావాలంటున్న IT కంపెనీ.. 9,000 మంది నియామకం.. ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు..! | software company planning to hire 9000 employees from india as part of work from anywhere options

software company planning to hire 9000 employees from india as part of work from anywhere options
Story first published: Wednesday, September 21, 2022, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X