న్యూఢిల్లీ: రానున్న అయిదేళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన గతంలో కంటే రెండింతలు ఖర్చు చేసే ప్రణాళికలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆవిష్కరించారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.51 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని, ఇప్పుడు దానిని రెట్టింపు చేసి రూ.105 లక్షల కోట్లు లేదా రూ.105 ట్రిలియన్‌లు ఖర్చు చేయనున్నట్లు నిర్మల తెలిపారు.
ఇన్‌ప్రాస్ట్రక్చర్ బ్లూప్రింట్‌ను కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ తయారు చేసింది. దీనిని సీతారామన్ ఆవిష్కరించారు. ఈ ప్యానెల్ గత నాలుగైదు నెలల్లో స్టేక్ హోల్డర్స్‌తో 70పర్యాయాలు భేటీ అయిందని, ఈ సంప్రదింపుల అనంతరం రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను గుర్తించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 5 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, ఇప్పుడు మౌలిక సదుపాయాల పెట్టుబడులను రూ.100 లక్షల కోట్లకు పెంచడం దానికి ఓ అడుగు అన్నారు.

జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌లో కేంద్రం, రాష్ట్రాల వాటా 39 శాతం చొప్పున (రెండింటిది 78 శాతం) ఉంది. 22 శాతం ప్రయివేట్ సెక్టార్‌ది 2025 నాటికి ప్రయివేటు రంగ సహకారం 30 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 2020 రెండో అర్ధ సంవత్సరంలో గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ జరగనుందని చెప్పారు.
పవర్, రైల్వే, అర్బన్ ఇరిగేషన్, మొబిలిటీ, రెనెవబుల్ ఎనర్జీ, రైల్వేస్, అర్బన్ డెవలప్‌మెంట్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి రంగాల్లో ప్రాజెక్టులను టాస్క్ ఫోర్స్ గుర్తించినట్లు చెప్పారు. దాదాపు రూ.25 లక్షల కోట్ల ఎనర్జీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయని, మరో రూ.20 లక్షల కోట్ల ప్రాజెక్టులు రోడ్డు, రూ.14 లక్షల కోట్ల ప్రాజెక్టులు రైల్వేకు సంబంధించినవి అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications