For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా ఆరో నెల తగ్గిన మ్యూచువల్ ఫండ్స్ సిప్స్

|

మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) పెట్టుబడులు వరుసగా ఆరో నెల క్షీణించాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెట్టుబడిదారులు లిక్విడిటీని చేతిలో నిలబెట్టుకునేందుకు మొగ్గు చూపారు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో సెప్టెంబర్ మాసంలోను సిప్‌లు తగ్గాయి. గత నెలలో రూ.7,788 కోట్లు సిప్ పెట్టుబడుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చాయి.

ఆగస్ట్ నెలలో సిప్స్ ద్వారా రూ.7,791 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆదాయం స్థిరంగా ఉంటుందని నమ్మి, మదుపు చేయాలని ఇన్వెస్టర్లు భావిస్తేనే ప్రస్తుత పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో గత నెలలో కొత్తగా 7.37 లక్షల ఫోలియోస్‌ను జత చేర్చుకున్నట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్(AMFI) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో ఇది 4.5 లక్షలుగా ఉంది. సెప్టెంబర్ మాసంలో పెరిగింది. అయితే ఫోలియోలు పెరిగినా పెట్టుబడుల మొత్తం అంతగా పెరగలేదు.

2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్

SIP inflows drop for sixth month in September

2018 సెప్టెంబర్ నెలలో రూ.7.727 కోట్ల తర్వాత మళ్లీ గత నెలలో సిప్స్ రూపంలో వచ్చిన పెట్టుబడులు కనిష్టం. సెప్టెంబర్ నెలలో రూ.7,781 కోట్లు, ఆగస్ట్‌లో రూ.7,791 కోట్లు, జూలైలో రూ.7,831 కోట్లు, జూన్‌లో రూ.7,917 కోట్లు, మే నెలలో రూ.8,123 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,376 కోట్లు మార్చిలో రూ.8,641 కోట్లు సిప్స్ ద్వారా వచ్చాయి.

English summary

వరుసగా ఆరో నెల తగ్గిన మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ | SIP inflows drop for sixth month in September

Investments in mutual funds via SIPs dropped for the sixth consecutive month to ₹7,788 crore in September, in a challenging economic environment.
Story first published: Wednesday, October 14, 2020, 18:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X