For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో అమెరికా కంపెనీ మరో భారీ పెట్టుబడి

|

అమెరికాకు చెందిన ప్రయివేటు ఈక్విటీ కంపెనీ సిల్వర్ లేక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లలో రూ.5,655.75 కోట్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 1.15 శాతం వాటాను దక్కించుకోనుంది. రూ.4.90 లక్షల వ్యాల్యూ ప్రకారం ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తోంది. ఇటీవలే ఫేస్‌బుక్ జియోలో 9.9 శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడులపై రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఈ రోజు ప్రకటన చేశాయి.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, రూపాయి బలహీనం: రిలయన్స్‌కు జియో-సిల్వర్ లేక్ షాక్భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, రూపాయి బలహీనం: రిలయన్స్‌కు జియో-సిల్వర్ లేక్ షాక్

'సిల్వర్ లేక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.5,655.75 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రకటిస్తున్నాయి. రూ.4.90 లక్షల కోట్ల వ్యాల్యూ వద్ద పెట్టుబడులు పెడుతున్నారు.' అని రెండు సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి.

 Silver Lake to invest Rs 5,655.75 crore in Reliance Jio Platforms

జియో ప్లాట్ ఫామ్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. జియో ప్లాట్‌ఫాం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీపై దృష్టి సారించింది. రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్ ద్వారా 388 మిలియన్లకు పైగా కనెక్టివిటీని అందించే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. జియో ప్లాట్ ఫాం అనుబంధంగా ఉంది.

టెక్నాలజీ, ఫైనాన్స్ సెక్టార్‌లో సిల్వర్ లేక్‌కు మంచి సంస్థగా పేరుందని, అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల ద్వారా ఇండియాను మరింత డిజిటల్ సొసైటీని మార్చడమే తమ లక్ష్యమని, ఈ ఒప్పందానికి సంతోషిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు.

English summary

రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో అమెరికా కంపెనీ మరో భారీ పెట్టుబడి | Silver Lake to invest Rs 5,655.75 crore in Reliance Jio Platforms

US private equity firm Silver Lake will invest Rs 5,655.75 crore in Jio Platforms for a 1.15% stake at an equity value of Rs 4.90 lakh crore, a deal which came less than two weeks after Facebook’s investment announcement into the unit of Reliance Industries and will further help the Indian oil-to-telecom conglomerate reduce debt.
Story first published: Monday, May 4, 2020, 13:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X