రిలయన్స్ జియో డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోలోకి పెట్టుబడులు వరద కొనసాగుతోంది. నిన్నటికి నిన్న సౌదీ అరేబియాకు చెందిన ముబాదాల రూ.9,093.60 కోట్ల పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.85 శాతం వాటాను దక్కించుకుంది. ఆ వెంటనే గతంలో ఇన్వెస్ట్ చేసిన సిల్వర్ లేక్ మరోసారి భారీ పెట్టుబడులు పెట్టింది. ఆరు వారాల్లో రూ.92,202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖేష్ అంబానీ వచ్చే మార్చి వరకు టార్గెట్‌గా పెట్టుకుంటే, ఈ ఏడాది డిసెంబర్ నాటికే రుణరహిత సంస్థగా నిలిచే అవకాశముంది.

సిల్వర్ లేక్ మరో పెట్టుబడి
సిల్వర్ లేక్, సహా ఇన్వెస్టర్లు మరో రూ.4,546.80 కోట్ల పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనంగా 0.93 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు శుక్రవారం రాత్రి కంపెనీ ప్రకటించింది. అంతకుముందు కొద్ది గంటల ముందే ముబాదాల రూ.9,093.60 కోట్లతో 1.85 శాతం వాటాను దక్కించుకున్నట్లు ప్రకటించింది. వరుసగా పెట్టుబడులు వస్తుండటంతో లక్ష్యానికి ముందే రుణరహిత సంస్థగా రిలయన్స్ నిలిచే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు..
గత ఆరు వారాల్లో ఏడు ఒప్పందాల ద్వారా (సిల్వర్ లేక్ రెండుసార్లు) రిలయన్స్ రూ.92,202 కోట్లు సమీకరించింది. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాలలు పెట్టుబడులు పెట్టాయి.
- ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా

ముబాదాల, సిల్వర్ లేక్
వినూత్న వ్యాపారాలకు తోడ్పాటు అందించేందుకు ముబాదాల 2017లో కొత్తగా వెంచర్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఇది అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల్లో పలు వెంచర్ ఫండ్స్‌ను నిర్వహిస్తోంది. ముబాదాల పోర్ట్‌ఫోలియోలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, మెటల్స్, మైనింగ్, ఫార్మా, మెడికల్ టెక్, పునరుత్పాదక విద్యుత్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.
టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సిల్వర్ లేక్ 1999లో ఏర్పాటయింది. ట్విట్టర్, ఎయిర్‌బీఎన్బీ, అలీబాబా వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications