For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చావుదెబ్బ కొట్టిన ఎల్ఐసీ: పతనంలో కొత్త రికార్డులు: ఒక్కో షేర్ మీద రూ.300 నష్టం

|

ముంబై: జీవిత బీమా సంస్థ షేర్ల ధరల పతనం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్స్‌లో ఎల్ఐసీ షేర్ల ధరలు ఇవ్వాళ మరింత దిగజారాయి. ఒక్కో షేర్ ధర 650 రూపాయల వరకు పడిపోయింది. కటాఫ్ ప్రైస్‌తో పోల్చుకుని చూస్తే- 280 రూపాయల వరకు నష్టాన్ని మిగిల్చిందీ లైఫ్ ఇన్సూరెన్స్ జెయింట్. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. మరింత పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

లిస్టింగ్ రోజే బిగ్ షాక్..

లిస్టింగ్ రోజే బిగ్ షాక్..

ఎల్‌ఐసీ ఐపీఓ లాంచింగ్‌కు ముందు.. ఆ తరువాత మంచి బజ్ లభించింది గానీ- దాన్ని కాపాడుకోలేకపోయింది. స్టాక్ మార్కెట్స్‌లో వరస్ట్ పెర్‌ఫార్మ్‌గా చేసింది. మైనస్‌లో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. 21,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి జారీ అయిన పబ్లిక్ ఇష్యూ ఇది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.902-949 రూపాయలు కాగా 10 శాతం నష్టంతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది.

 తొలి గంటలోనే

తొలి గంటలోనే

సోమవారం స్టాక్ మార్కెట్‌లో రూ.690.10 పైసల వద్ద ఎల్ఐసీ ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ తరువాత శరవేగంగా పతనమైంది. ఈ ధర మరింత పడిపోయింది. తొలిగంట ముగిసేసమయానికి రూ.676.40 పైసల వద్ద ట్రేడ్ అయింది. తొలి గంటలోనే ఒక్కో షేర్ మీద రూ.33.10 పైసల నష్టాన్ని మిగిల్చింది. కటాఫ్ ప్రైస్ 949 రూపాయలు కాగా.. ఇవ్వాళ్టి ట్రేడింగ్ ప్రైస్ 676 రూపాయలు. అంటే ఒక్కో షేర్ మీద 680 రూపాయల నష్టం నమోదు చేసింది.

 వారం రోజుల్లో రూ.100కు పైగా

వారం రోజుల్లో రూ.100కు పైగా

ఈ స్థాయిలో ఎల్ఐసీ షేర్ల ధర పతనం కావడం కొత్తేమీ కాదు. స్టాక్ మార్కెట్స్‌లో లిస్టింగ్ అయిన తొలి రోజుల్లో 800 రూపాయలకు పైగా ధరతో ట్రేడింగ్ నమోదు చేసుకుంది. ఆ తరువాత క్రమంగా 700 రూపాయలకు చేరింది. ఈ మార్క్ నుంచి శరవేగంగా పడిపోయింది ఎల్ఐసీ షేర్ల రేట్. వారం-పది రోజుల్లోనే 600 రూపాయలకు దిగువగా ట్రేడింగ్ నమోదు చేసుకుందంటే దీని పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పేటీఎంతో పోటీ..

పేటీఎంతో పోటీ..

ఎల్ఐసీ షేర్లు.. మరో పేటీఎంలా తయారయ్యాయి. పేటీఎం కూడా ఇదే పరిస్థితిలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 2,150 రూపాయల కటాఫ్ ధరతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎం ఒక్కో షేర్ ధర 600 రూపాయల కంటే దిగువకు పడిపోయింది. ఇవ్వాళ పేటీఎం షేర్ ధర రూ.595.80 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది. సాయంత్రానికి మళ్లీ 600 రూపాయలను దాటొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఎల్ఐసీ షేర్ల టార్గెట్ ప్రైస్ 875 రూపాయలుగా ఉండొచ్చని, భవిష్యత్‌లో షేర్ల ధర క్రమంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

స్టాక్ మార్కెట్స్ కూడా..

స్టాక్ మార్కెట్స్ కూడా..

ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో 1,500 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. సెన్సెక్స్ 1,415.89 పాయింట్ల నష్టంతో మొదలైంది. 52,887.55 పాయింట్లతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తరువాత ఇంకా కిందికి దిగజారింది. ఒకదశలో 52,740.93 పాయింట్లకు క్షీణించింది. కొంత తేరుకుంది. తొలి గంట గడిచే సమయానికి 52,867 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 420 పాయింట్లను నష్టపోయింది. తొలి గంటలో 15,781 పాయింట్ల మేర పతనమైంది.

English summary

చావుదెబ్బ కొట్టిన ఎల్ఐసీ: పతనంలో కొత్త రికార్డులు: ఒక్కో షేర్ మీద రూ.300 నష్టం | Shares of LIC hit fresh record low of Rs 682 on the BSE

Shares of LIC hit fresh record low of Rs 682 on the BSE.
Story first published: Monday, June 13, 2022, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X