For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID-19: ఆర్బీఐ కీలక నిర్ణయం, వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు

|

ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గించింది. కరోనా కారణంగా ప్రపంచ దేశాలు కుప్పకూలుతున్నాయి. అమెరికా వంటి అగ్రదేశం ఆర్థిక వ్యవస్థ కునారిల్లింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్న రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది మార్కెట్లకు ఊతమిచ్చింది.

ఈ రోజు (మార్చి 27) ఆర్బీఐ కూడా రెపో రేటు తగ్గించి మరికొంత ఊరట కల్పించింది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటు 75 బేసిస్ బాయింట్లు తగ్గడంతో ఇప్పుడు 4.40 శాతం వద్ద ఉంది. రివర్స్ రెపో 4 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్భణం అదుపులో ఉందని చెప్పారు. ఆర్థిక స్థిరత్వం కోసం రెపో రేటు, రివర్స్ రెపో రేటు తగ్గించినట్లు తెలిపారు.

 Shaktikanta Das announces 75 bps cut to 4.4%

ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని శక్తికాంత దాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మనమంతా సహకరిద్దామని పిలుపునిచ్చారు.

English summary

COVID-19: ఆర్బీఐ కీలక నిర్ణయం, వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు | Shaktikanta Das announces 75 bps cut to 4.4%

RBI repo rate cut by 75 basis points to 4.4%: RBI Governor. RBI Governor Press Conference Live | In view of COVID-19 pandemic, MPC advanced its meeting. MPC met on 24th, 26th and 27th March and took care of evaluation of macroeconomic and financial conditions: RBI Governor.
Story first published: Friday, March 27, 2020, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X