For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊగిసలాటలో మార్కెట్లు, కారణాలెన్నో.. ఐటీ స్టాక్స్‌పై 'అమెరికా' ఒత్తిడి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 25) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 303.72 పాయింట్లు లేదా 0.87% పడిపోయి 34,565.26, నిఫ్టీ 89.40 పాయింట్లు లేదా 0.87% దిగజారి 10,215.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఉదయం 421 షేర్లు లాభాల్లో, 812 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. 45 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి 75.75 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్లో 75.72 వద్ద ముగిసింది.

చైనా బ్యాంకులకు నేను హామీ ఇవ్వలేదు: అనిల్ అంబానీ షాక్, రుణరహిత సంస్థగా అనిల్ సంస్థ!చైనా బ్యాంకులకు నేను హామీ ఇవ్వలేదు: అనిల్ అంబానీ షాక్, రుణరహిత సంస్థగా అనిల్ సంస్థ!

ఐటీ, బ్యాంకు షేర్లపై ఒత్తిడి

ఐటీ, బ్యాంకు షేర్లపై ఒత్తిడి

అమెరికా హెచ్1బీ వీసాల అంశం నేపథ్యంలో ఐటీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. బ్యాంక్ తదితర సెక్టార్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో గెయిల్, హీరో మోటో కార్ప్, ఐటీసీ, వేదాంత, గ్రాసిమ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ప్రాటెల్, ఐచర్ మోటార్స్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి.

IMF వృద్ధి రేటు అంచనా

IMF వృద్ధి రేటు అంచనా

మార్కెట్లు తొలుత నష్టాల్లో ప్రారంభం కావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత వృద్ధి రేటు మైనస్ 4.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ పరిణామాలతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం ఇందుకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది. 1961 తర్వాత భారత్‌కు ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు అని తెలిపింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాతో పోలిస్తే ఇది 1.9 శాతం తక్కువ. వృద్ధి రేటు భారీగా పడిపోవడం మార్కెట్ పైన ప్రభావం చూపింది.

కరోనా కేసులు.. జూన్ కాంట్రాక్ట్

కరోనా కేసులు.. జూన్ కాంట్రాక్ట్

దేశంలో అన్-లాక్ కారణంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది కూడా మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది. దీనికి తోడు నేడు జూన్ ఎఫ్ అండ్ వో కాంట్రాక్టులు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 147 కంపెనీలు ఈ రోజు కార్పోరేట్ ఫలితాలను ప్రకటించనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, అపోలో హాస్పిటల్స్, అశోక్ లేల్యాండ్ వంటివి ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌ను హెచ్1బీ వీసాల అంశం దెబ్బతీసింది.

గ్లోబల్ మార్కెట్ ప్రభావం

గ్లోబల్ మార్కెట్ ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. వాణిజ్య ఉద్రిక్తతలు, కరోనా వంటి అంశాల కారణంగా గ్లోబల్ మార్కెట్లు నష్టపోయాయి. అమెరికా డౌజోన్స్ 2.72 శాతం, ఎస్ అండ్ పీ 500 కూడా 2.59 శాతం, నాస్‌దాక్ 2.19 శాతం నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు 3 శాతానికి పైగానే నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ సూచీ నిక్కీ 1.38 శాతం, దక్షిణ కొరియా కేవోఎస్పీఐ 1.72 శాతం పడిపోయింది.

English summary

ఊగిసలాటలో మార్కెట్లు, కారణాలెన్నో.. ఐటీ స్టాక్స్‌పై 'అమెరికా' ఒత్తిడి | Sensex up 130 points, Nifty above 10,260: Why IT stocks under pressure

Benchmark indices has recovered but trading with marginal losses ahead of June F&O expiry. Except Bank and IT, other sectoral indices are trading in the green.
Story first published: Thursday, June 25, 2020, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X