For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 340 పాయింట్లు పతనం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 11) భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు సెషన్లలో లాభపడిన సూచీలు తాజాగా ఢీలా పడ్డాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదులుతున్నాయి. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక రంగాల షేర్లు నష్టపోయాయి. కరోనా కేసులు ఇలాగే పెరుగుతుంటే భారత వృద్ధి రేటు పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దీనికి తోడు నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో సూచీలు నష్టాల్లో కదలాడి, చివరకు అలాగే ముగిశాయి.

భారీ నష్టాల్లో మార్కెట్లు

భారీ నష్టాల్లో మార్కెట్లు

సెన్సెక్స్ నేడు ఉదయం 49,066.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,304.47 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,988.18 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 340.60 (0.69%) పాయింట్లు నష్టపోయి 49,161.8 1పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 91.60 (0.61%) పాయింట్లు క్షీణించి 14,850.75 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,789.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,900.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,771.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 5.88 శాతం, NTPC 4.64 శాతం, IOC 4.59 శాతం, ONGC 3.69 శాతం, BPCL 1.88 శాతం లాభపడ్డాయి.

నేటి టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్ 3.22 శాతం, హిండాల్కో 3.04 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 2.98 శాతం, HDFC 2.65 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.59 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.61 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.93 లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.22 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.76 శాతం, నిఫ్టీ మీడియా 0.79 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.12 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.29 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.82 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.29 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.22 శాతం, నిఫ్టీ ఐటీ 0.63 శాతం, నిఫ్టీ మెటల్ 0.92 శాతం, నిఫ్టీ ఫార్మా 0.46 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.91 శాతం నష్టపోయాయి.

English summary

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 340 పాయింట్లు పతనం | Sensex tumbles 341 points on weak global cues, Nifty ends below 14,900

Snapping its four-session rising streak, equity benchmark Sensex tumbled 341 points on Tuesday, led by losses in index-heavyweights HDFC twins, Kotak Bank and TCS amid negative cues from global markets.
Story first published: Tuesday, May 11, 2021, 20:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X