For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటో జంప్, బ్యాంకింగ్ బేజారు: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (అక్టోబర్ 28) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 49.58 పాయింట్లు(0.12% శాతం) క్షీణించి 40,472.52 వద్ద, నిఫ్టీ 14.60 పాయింట్లు(0.12% శాతం) నష్టపోయి 11,874.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 430 షేర్లు లాభాల్లో, 392 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 57 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆ తర్వాత స్టాక్ సెన్సెక్స్ ఏకంగా 235 పాయింట్ల మేర క్షీణించింది. నిఫ్టీ 11,850 దిగువకు వచ్చింది.

ఆటో, ఇన్ఫ్రా స్టాక్స్ ఒక్కో శాతం చొప్పున లాభాల్లో ఉన్నాయి. మిగతా రంగాలు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. నిక్కీ, హాంగ్‌షెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పీ, స్ట్రెయిట్ టైమ్స్, జకర్తా కాంపోజిట్ నష్టాల్లో ఉన్నాయి. కేవలం సెట్ కాంపోజిట్, షాంఘై కాంపోజిట్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

భారత్‌పై అందులో పట్టుకోసం అమెజాన్ జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ సై! అందుకే ఈ టగ్ ఆఫ్ వార్భారత్‌పై అందులో పట్టుకోసం అమెజాన్ జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీ సై! అందుకే ఈ టగ్ ఆఫ్ వార్

ఆటో స్టాక్స్ అదుర్స్

ఆటో స్టాక్స్ అదుర్స్

డాలర్ మారకంతో రూపాయి 73.70 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 7.71తో ముగిసింది. నేడు దాదాపు స్థిరంగా ఉంది.

ఆటో స్టాక్స్ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. టాటా మోటార్స్ 4.35 శాతం, హీరో మోటో కార్ప్ 3.84 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.20 శాతం, భారత్ ఫోర్జ్ 1.96 శాతం, ఎక్సైడ్ఇండ్ 1.76 శాతం, మారుతీ 1.38 శాతం, ఐచర్ మోటార్స్ 0.85 శాతం మేర లాభపడ్డాయి. అశోక్ లేలాంట్, ఎంఆర్ఎఫ్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

ఎల్ అండ్ టీ ఫలితాలు రానున్న నేపథ్యంలో ఈ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.

ఈ రోజు యాక్సిస్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హీరో మోటో కార్ప్ సహా 70 కంపెనీల ఫలితాలు ఉన్నాయి.

కేపీఆర్ మిల్ 15 శాతం ఎగిసి 52 వారాల గరిష్టానికి చేరుకుంది.

భారతీ ఎయిర్‌టెల్ నష్టాలు నమోదు చేసినప్పటికీ ఆదాయం భారీగా పెరిగింది. నష్టాలు కూడా పెద్ద మొత్తంలో తగ్గాయి. దీంతో ఈ కంపెనీ స్టాక్ 10 శాతం మేర ఎగిసింది.

టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్ కొనుగోలు

టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్ కొనుగోలు

టాటా గ్రూప్ బిగ్ బాస్కెట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయనున్నదనే వార్తల నేపథ్యంలో ఈ గ్రూప్ స్టాక్స్ ఎగిశాయి.

త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో టైటాన్ కంపెనీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

ఉదయం గం.11 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, యూపీఎల్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, రిలయన్స్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ డౌన్

ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ డౌన్

ఐటీ స్టాక్స్ నష్టాల్లో టీసీఎస్ 0.35 శాతం, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్ 1.42 శాతం, మైండ్ ట్రీ 1.76 శాతం నష్టపోగా, టెక్ మహీంద్ర స్టాక్ 0.62 శాతం, విప్రో స్టాక్ 1.03 శాతం, కోఫోర్జ్ 1.40 శాతం లాభపడ్డాయి.

అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

బ్యాంకింగ్ స్టాక్స్ కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఎఫ్ అండ్ ఓ కౌంటర్లలో వేదాంతా, ఐడియా, భారత్‌ ఫోర్జ్, ఎస్కార్ట్స్, జిందాల్ స్టీల్, వోల్టాస్, బాటా, బెర్జర్ పెయింట్స్, ఆర్బీఎల్ బ్యాంకు 4-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. శ్రీరామ్ ట్రాన్స్, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్, డీఎల్ఎఫ్, భెల్, పీవీఆర్, అశోక్ లేలాండ్, అంబుజా, పెట్రోనెట్, 2-1 శాతం మధ్య క్షీణించాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో లాభపడ్డాయి.

English summary

ఆటో జంప్, బ్యాంకింగ్ బేజారు: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex slips 235 points, Nifty below 11,850: Bharti Airtel top gainer

Sensex, Nifty were trading lower on Wednesday dragged mainly by banks and FMCG stocks, however, gains in IT stocks and heavyweights Bharti Airtel capped some losses.
Story first published: Wednesday, October 28, 2020, 11:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X