For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, 3 రోజుల్లో 800 పాయింట్లు పతనం: రిలయన్స్ మళ్లీ డౌన్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి 18) భారీ నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్ అనంతరం వరుసగా భారీగా లాభపడిన మార్కెట్లు, ఇటీవల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టాల్లోకి వెళ్లాయి. దిగ్గజ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు సూచీలు నష్టపోయాయి. మొన్న స్వల్పంగా నష్టపోయినప్పటికీ, నిన్న, ఇవాళ ఒక్కోరోజుకు 400 పాయింట్ల వరకు క్షీణించాయి. ఈ రోజు ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ప్రయివేటురంగ బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి.

'ప్రయివేటీకరణతో ఇబ్బందిలేదు, కానీ ఈ టైంలో భయంకర ఆలోచన''ప్రయివేటీకరణతో ఇబ్బందిలేదు, కానీ ఈ టైంలో భయంకర ఆలోచన'

వరుస నష్టాలు

వరుస నష్టాలు

మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. నేడు సెన్సెక్స్ 379.14 పాయింట్లు లేదా 0.73% నష్టపోయి 51,324.69 పాయింట్ల వద్ద, నిఫ్టీ 89.90 పాయింట్లు లేదా 0.59% నష్టపోయి 15,119 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 1609 షేర్లు లాభాల్లో, 1316 షేర్లు నష్టాల్లో ముగియగా, 151 షేర్లలో ఎలాంటి మార్పులేదు. PSU బ్యాంకు షేర్లు 5 శాతం మేర, IT, మెటల్, ఎనర్జీ స్టాక్స్ సూచీలు 1 శాతం నుండి 2 శాతం మేర లాభపడ్డాయి. ఆటో సూచీ 1 శాతం మేర నష్టపోయింది. సెన్సెక్స్ మూడు రోజుల్లో 800 పాయింట్ల మేర నష్టపోయింది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు ఇప్పుడు ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోతున్నాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ONGC 8.26 శాతం, గెయిల్ 6.47 శాతం, బీపీసీఎల్ 4.98 శాతం, IOC 4.21 శాతం, NTPC 4.08 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 2.49 శాతం, శ్రీసిమెంట్స్ 2.28 శాతం, నెస్ట్లే 2.25 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.24 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 2.21 శాతం లాభపడ్డాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, గెయిల్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రిలయన్స్ స్టాక్ నేడు 0.75 శాతం క్షీణించి రూ.2,067 వద్ద ముగిసింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.59 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.28 శాతం లాభపడ్డాయి.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎనర్జీ 2.54 శాతం, నిఫ్టీ ఐటీ 1.33శాతం, నిఫ్టీ మెటల్ 1.31 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.60 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ ఆటో 1.35 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.88 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.48 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.43 శాతం, నిఫ్టీ మీడియా 0.77 శాతం, నిఫ్టీ ఫార్మా 0.53 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.52 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.13 శాతం నష్టపోయాయి.

English summary

ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, 3 రోజుల్లో 800 పాయింట్లు పతనం: రిలయన్స్ మళ్లీ డౌన్ | Sensex sheds over 800 points in 3 days as bears rule Street

Bajaj Finance, Nestle, Kotak Mahindra Bank, M&M and Shree Cements were among major losers on the Nifty, while gainers included ONGC, GAIL, BPCL, IOC and NTPC.
Story first published: Thursday, February 18, 2021, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X