For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ స్టాక్స్ అదుర్స్, ఏజీఎంతో రిలయన్స్ బేజారు: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (జూన్ 24, గురువారం) భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా తదితర ఐటీ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఎగిసిడ్డాయి. దీనికి తోడు HDFC బ్యాంకు, ICICI బ్యాంకు షేర్లు కూడా రాణించడం కలిసి వచ్చింది. రిలయన్స్ ఏజీఎం నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. ఆరామ్‌కో ప్రతినిధిని బోర్డులోకి తీసుకోవడం, జియో నెక్స్ట్ ఫోన్ ప్రకటన చేశారు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.18 వద్ద నిలిచింది. ఐటీ, మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించాయి.

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్ ఉదయం 52,514.57 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,830.68 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,385.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,737.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,821.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,702.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 392.92 (0.75%) పాయింట్లు లాభపడి 52,699.00 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103.50 (0.66%) పాయింట్లు లాభపడి 15,790.45 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఇన్ఫోసిస్ 3.73 శాతం, టీసీఎస్ 3.44 శాతం, టెక్ మహీంద్రా 2.23 శాతం, JSW స్టీల్ 2.03 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.87 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్ 2.35 శాతం, సిప్లా 1.17, కోల్ ఇండియా 1.38 శాతం, ఐవోసీ 1.28 శాతం, అదానీ పోర్ట్స్ 1.22 శాతం, ఓఎన్జీసీ 1.09 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, HDFC బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.66 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.43 శాతం నష్టపోయింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.28 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.73 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.55 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.15 శాతం, నిఫ్టీ ఐటీ 2.79 శాతం, నిఫ్టీ మెటల్ 0.57 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.79 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 1.35, నిఫ్టీ మీడియా 1.14 శాతం, నిఫ్టీ ఫార్మా 0.36 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.76 శాతం నష్టపోయాయి.

English summary

ఐటీ స్టాక్స్ అదుర్స్, ఏజీఎంతో రిలయన్స్ బేజారు: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Sensex, Nifty end higher led by IT stocks: RIL ends in red

Sensex, Nifty retained the growth trajectory at day's start to end the day nearly 0.70% higher on Thursday.
Story first published: Thursday, June 24, 2021, 20:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X