For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, మిడ్ క్యాప్ ఆల్‌టైమ్ హై

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 3) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను క్షీణించలేదు. సెన్సెక్స్ ఏకంగా 52,230 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15,700 పాయింట్లకు సమీపంలో ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు నిఫ్టీ ఆటో, ఫార్మా స్టాక్స్ నుండి నిధులను మళ్లించడంతో ఆయా రంగాల షేర్లు నష్టపోయాయి. రియాల్టీ సూచీ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా నాలుగు శాతం లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ప్రాఫిట్ బుకింగ్ నుండి కొనుగోళ్లకు మొగ్గు చూపడం వంటి అంశాలు మార్కెట్లో ఉత్సాహాన్ని నింపాయి.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ నేడు ఉదయం 52,121.58 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,273.23 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,942.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 382.95 (0.74%) పాయింట్లు ఎగిసి 52,232.43 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,655.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,705.10 వద్ద గరిష్టాన్ని, 15,611.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 114.15 (0.73%)

పాయింట్లు ఎగిసి 15,690.35 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 6.65 శాతం, ONGC 4.03 శాతం, ఐచర్ మోటార్స్ 3.36 శాతం, లార్సన్ 2.71 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.85 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.16 శాతం, విప్రో 0.73 శాతం, సిప్లా 0.68 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.56 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.51 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, అదానీ పోర్ట్స్, SBI, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 స్టాక్స్ 0.73 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.92 శాతం ఎగిసింది. నిఫ్టీ ఆటోలో దాదాపు మార్పులేదు. నిఫ్టీ బ్యాంకు 0.78 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.52 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.96 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.59 శాతం, నిఫ్టీ ఐటీ 0.18 శాతం, నిఫ్టీ మీడియా 1.64 శాతం, నిఫ్టీ మెటల్ 0.66 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.41 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.79 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.71 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.26 శాతం, నష్టపోయాయి.

English summary

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, మిడ్ క్యాప్ ఆల్‌టైమ్ హై | Sensex, Nifty end at record closing high: Midcap index also surges to all time high

Stock Market Updates. Buying was seen in the metal, FMCG, energy and banking names, while pharma stocks remained under pressure.
Story first published: Thursday, June 3, 2021, 19:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X