For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త శిఖరాలకు సూచీలు, అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లోనే...

|

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (జూన్ 15) లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. కీలక రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సెన్సెక్స్ 52,800ను క్రాస్ చేసి, 53,000 దిశగా పరుగులు పెడుతోంది. నిఫ్టీ 15,900 దిశగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడం కలిసి వచ్చింది.

అదానీ గ్రూప్ షేర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ గ్రూప్ షేర్లలో రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను NSDL స్తంభింప చేసినట్లు వచ్చిన వార్తలతో సోమవారం అదానీ గ్రూప్ షేర్ల వ్యాల్యూ భారీగా పతనమైంది.

భారీ లాభాల్లో స్టాక్స్

భారీ లాభాల్లో స్టాక్స్

సెన్సెక్స్ 52,751.83 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,869.51 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,671.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,866.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,901.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,842.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11.40 సమయానికి 241.03 (0.46%) పాయింట్లు ఎగిసి 52,792.56 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 69.45 (0.44%) పాయింట్లు లాభపడి 15,879.95 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 2.38 శాతం, ఓఎన్జీసీ 1.96 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.43 శాతం, టాటా స్టీల్ 1.25 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.23 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 1.16 శాతం, కోల్ ఇండియా 0.78 శాతం, అదానీ పోర్ట్స్ 0.47 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.43 శాతం, సిప్లా 0.34 శాతం నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

అదానీ గ్రూప్ అలాగే...

అదానీ గ్రూప్ అలాగే...

క్రితం భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు ఈ రోజు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ గ్రూప్ షేర్లలో రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన 3 విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల ఖాతాలను NSDL స్తంభించిందనే వార్తల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌లో ఈ గ్రూప్ షేర్ల వ్యాల్యూ దాదాపు 25 శాతం పతనమైంది. అయితే ఖాతాలను స్తంభింపజేయలేదని అటు కంపెనీ, ఇటు NSDL స్పష్టం చేసింది. దీంతో ఈ గ్రూప్ షేర్లు కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. కానీ నేడు మళ్లీ కాస్త నష్టాల దిశగా సాగుతున్నాయి.

English summary

సరికొత్త శిఖరాలకు సూచీలు, అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లోనే... | Sensex, Nifty at fresh record high: RIL, Infosys drive gains

Adani group stocks are trading lower even after NSDL says accounts of foreign funds invested in Adani companies are not frozen.
Story first published: Tuesday, June 15, 2021, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X