ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 11) భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు వరకు నష్టపోయింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లకు పైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ నష్టాల్లోనే ఉంది. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదులుతున్నాయి. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. కీలక రంగాల షేర్లు నష్టపోయాయి.
కరోనా కేసులు ఇలాగే పెరుగుతుంటే భారత వృద్ధి రేటు 8.2 శాతానికి పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. దీనికి తోడు నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో సూచీలు నష్టాల్లో ఉన్నాయి.

భారీ నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 49,066.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,304.47 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,988.18 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.50 సమయానికి సెన్సెక్స్ 330.95 (0.67%) పాయింట్ల మేర నష్టపోయి 49,171.46 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ అదే సమయానికి 85.95 (0.58%) పాయింట్లు క్షీణించి 14,856.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,789.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,900.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,771.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మధ్యాహ్నం 1 గంటల సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 4.32 శాతం, IOC 4.14 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.55 శాతం, ఎన్టీపీసీ 1.86 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.71 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HDFC 2.54 శాతం, హిండాల్కో 2.48 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 2.09 శాతం, JSW స్టీల్ 1.82 శాతం, విప్రో 1.77 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, హిండాల్కో, సన్ ఫార్మా ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.57 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.41 లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.27 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.84 శాతం, నిఫ్టీ మీడియా 0.81 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.27 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 0.63 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.09 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం, నిఫ్టీ ఐటీ 0.97 శాతం, నిఫ్టీ మెటల్ 0.72 శాతం, నిఫ్టీ ఫార్మా 0.67 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.70 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications