For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్ప లాభాల్లో మార్కెట్లు: ఎఫ్ఎంసీజీ మినహా అన్నీ నష్టాల్లో.. కొటక్ 9% జంప్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 27) స్వల్ప లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 9.59 పాయింట్లు (0.02%) లాభపడి 40,155.09 వద్ద, నిఫ్టీ 10.90 పాయింట్లు(0.09%) ఎగిసి 11,778.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 460 షేర్లు లాభాల్లో, 503 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 51 షేర్లలో ఎలాంటి మార్పులేదు. మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనుగోళ్లు పెరిగాయి.

ముఖేష్ అంబానీXజెఫ్ బెజోస్: రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!!

కొటక్ మహీంద్ర అదుర్స్

కొటక్ మహీంద్ర అదుర్స్

కొటక్ మహీంద్ర బ్యాంకు షేర్లు 9 శాతం మేర లాభపడి రూ.1,550 మార్క్ సమీపానికి వచ్చాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 26.7 శాతం లాభాలను నమోదు చేసింది. దీంతో ఈ స్టాక్స్ ఎగుస్తున్నాయి.

ఉదయం గం.10 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కొటక్ మహీంద్ర, శ్రీ సిమెంట్స్, నెస్ట్లే, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐవోసీ, విప్రో ఉన్నాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో కొటక్ మహీంద్ర, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

ఎఫ్ఎంసీజీ మినహా అన్నీ డౌన్

ఎఫ్ఎంసీజీ మినహా అన్నీ డౌన్

ప్రారంభంలో నిఫ్టీ ఎంఎంసీజీ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంకు 0.54 శాతం, నిఫ్టీ ఆటో 0.27 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.42 శాతం, నిఫ్టీ ఐటీ 0.47 శాతం, నిఫ్టీ మీడియా 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.94 శాతం, నిఫ్టీ ఫార్మా 0.30 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.90 శాతం, నిఫ్టీ ప్రయివేట్ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.56 శాతం క్షీణించాయి.

ఎఫ్ఎంసీజీ మాత్రమే 0.39 శాతం లాభాల్లో ఉంది.

ఐటీ స్టాక్స్ డౌన్

ఐటీ స్టాక్స్ డౌన్

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.63 శాతం, ఇన్ఫోసిస్ 2.31 శాతం, విప్రో 1.82 శాతం, మైండ్ ట్రీ 2.68 శాతం నష్టపోయాయి. కోఫోర్జ్, టెక్ మహీంద్ర మాత్రమే లాభాల్లో ఉన్నాయి. కోఫోర్జ్ 0.58 శాత, టెక్ మహీంద్ర 0.51 శాతం లాభపడింది.

కొటక్ మహీంద్ర, ఐపీసీఏ ల్యాబ్స్, ట్రెంట్, అధానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ దాదాపు 5 శాతం నుండి ఆ పైన లాభపడ్డాయి.

జీఎంటర్టైన్మెంట్, నెస్ట్లే ఇండియా, కోల్గేట్ పాల్మోలివ్, ఏషియన్ పేయింట్స్, ఎంఆర్ఎఫ్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ తదితర స్టాక్స్ 2 శాతానికి పైగా ఎగిశాయి.

English summary

స్వల్ప లాభాల్లో మార్కెట్లు: ఎఫ్ఎంసీజీ మినహా అన్నీ నష్టాల్లో.. కొటక్ 9% జంప్ | Sensex gains 40 points, Nifty nears 11,800: Kotak Mahindra jumps 7 percent

Metal and PSU banking names are under pressure, while buying seen in the FMCG pack. Kotak Mahindra Bank share price added 5 percent on October 27, a day after the private lender reported profit at Rs 2,184.5 crore in the September quarter, a year-on-year growth of 26.7 percent, aided by lower provisions.
Story first published: Tuesday, October 27, 2020, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X