నష్టాల నుండి భారీ లాభాలు: అదరగొట్టిన కొటక్ మహీంద్ర, ఐటీ రెండో రోజు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (అక్టోబర్ 27) భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న నష్టపోయిన స్టాక్స్ ఈ రోజు పుంజుకున్నాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్ మినహా మిగతా అన్నీ రంగాలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 376.60 పాయింట్లు (0.94%) లాభపడి 40,522.10 పాయింట్ల వద్ద, నిఫ్టీ 121.60 పాయింట్లు (1.03%) లాభపడి 11,889.40 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఆసియా మార్కెట్లపై ప్రభావం పడింది. భారత మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 1249 స్టాక్స్ లాభాల్లో, 1354 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 178 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
గెంటివేశారు: అమెరికా రెస్టారెంట్లో బిర్లా కూతురుకు, ఫ్యామిలీకి చేదు అనుభవం

కొటక్ మహీంద్రా 12 శాతం జంప్
బ్యాంకింగ్ స్టాక్స్ 3 శాతం మేర లాభపడ్డాయి. కొటక్ మహీంద్ర బ్యాంకు ఏకంగా 11.44 శాతం మేర ఎగిసింది. యాక్సిస్ బ్యాంకు దాదాపు 4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్ 1 శాతానికి పైగా లాభపడ్డాయి. బంధన్ బ్యాంకు, ఎస్బీఐ, పీఎన్బీ మాత్రం నష్టాల్లో ముగిశాయి.
కారు బుకింగ్స్‌లో టాటా మోటార్స్ ఏడాది ప్రాతిపదికన 100 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ స్టాక్ 2.21 శాతం లాభపడి రూ.136.65 వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా బ్యాంకు, శ్రీ సిమెంట్స్, నెస్ట్లే, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టీసీఎస్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో కొటక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

నిన్నటి నష్టాలు.. నేటి పూడ్చిన స్టాక్స్
నిన్నటి లాభాలను మార్కెట్లు ఈ రోజు పూడ్చాయి. బ్యాంకులు అద్భుతంగా ర్యాలీ చేశాయి. కొటక్ మహీంద్ర ప్రభావంతో నిఫ్టీ బ్యాంకు 3 శాతం ఎగిసింది.
నిఫ్టీ బ్యాంకు 694 పాయింట్లు ఎగిసి 24,770 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 207 పాయింట్లు లాభపడి 17,217 పాయింట్ల వద్ద ముగిసింది.
ఐపీసీఏ ల్యాబ్స్ 13 శాతం లాభపడింది.
సియేట్ ఒక శాతానికి పైగా నష్టపోయింది.
అమర్ రాజా బ్యాటరీ సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి లాభాలు చూడటంతో స్టాక్స్ 3 శాతం లాభపడ్డాయి.

ఐటీ స్టాక్స్ రెండోరోజు డౌన్
అక్టోబర్ 6వ తేదీ నుండి చూస్తే నిఫ్టీ భారీగా లాభపడింది.
అక్టోబర్ 19వ తేదీ తర్వాత నిఫ్టీ బ్యాంకు భారీగా ఎగిసింది.
నిఫ్టీ ఐటీ వరుసగా రెండో రోజు నష్టపోయింది.
అక్టోబర్ 8వ తేదీ తర్వాత నిఫ్టీ ఫార్మా మొదటిసారి భారీగా ఎగిసింది.
వారంలో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఎగిసిపడింది.
నిఫ్టీ రియాల్టీ వరుసగా మూడో రోజు ముగిసింది.
సెప్టెంబర్ 28వ తేదీ తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ నేడు ఎక్కువగా లాభడింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 20 లాభాల్లో ముగిశాయి.
డాలర్ మారకంతో రూపాయి 13 పైసలు పెరిగి 73.71 వద్ద ముగిసింది.
ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 1.99 శాతం, ఇన్ఫోసిస్ 1.61 శాతం, విప్రో 1.46 శాతం, మైండ్ ట్రీ 0.86 శాతం నష్టపోయాయి.
హెచ్‌సీఎల్ టెక్ 0.26 శాతం, టెక్ మహీంద్ర 1.09 శాతం, కోఫోర్జ్ 0.58 శాతం లాభపడ్డాయి.