For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ సరికొత్త రికార్డ్, రూ.10 లక్షల కోట్ల మార్క్‌కు ముఖేష్ అంబానీ రిలయన్స్

|

ముంబై: మార్కెట్లు బుధవారం లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ రికార్డ్ స్థాయికి చేరుకొని, ఆ తర్వాత కాస్త తగ్గింది. అయినప్పటికీ లాభాల్లో క్లోజ్ అయింది. కొనుగోళ్ల కారణంగా బుల్ రంకెలు వేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా వివిధ కంపెనీలు లాభాల్లో దూసుకెళ్లాయి. చమురు ధరల తగ్గుదల, వివిధ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో మార్కెట్లు దూసుకెళ్లాయి.

టెలికం, బ్యాంకింగ్ రంగాల షేర్ల కొనుగోళ్ల కారణంగా ఆరంభం నుంచే సెన్సెక్స్ దూసుకెళ్లంది. ఓ సమయంలో 70,816 పాయింట్లతో జీవన కాల గరిష్టానికి చేరుకుంది. నిఫ్టీ కూడా 12వేల మార్క్ దాటి ట్రేడ్ అయింది. చివరకు సెన్సెక్స్ 181.94 (0.45%) పాయింట్లు లాభపడి 40,651.64 వద్ద, నిఫ్టీ 59.00 (0.49%) లాభపడి 11,999.10 వద్ద క్లోజ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.83 వద్ద ట్రేడ్ అయింది.

దూసుకెళ్లిన రిలయన్స్ షేరు.. మార్కెట్ క్యాప్‌లో దేశంలోనే నంబర్ వన్!దూసుకెళ్లిన రిలయన్స్ షేరు.. మార్కెట్ క్యాప్‌లో దేశంలోనే నంబర్ వన్!

Sensex ends 182 pts higher, Reliance mcap inches closer to Rs 10 lakh crore mark

జియో టారిఫ్ పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. బుధవారం సాయంత్రం 38.75 (2.57 శాతం) పాయింట్లు పెరిగి 1,548.50 వద్ద ట్రేడ్ ముగిసింది. కంపెన షేర్లు ఓ దశలో 4 శాతానికి పైగా ఎగబాకింది. దీంతో మార్కెట్ వ్యాల్యూ కూడా దాదాపు రూ.10 లక్షల కోట్ల దరిదాపులకు చేరుకుంది.

English summary

సెన్సెక్స్ సరికొత్త రికార్డ్, రూ.10 లక్షల కోట్ల మార్క్‌కు ముఖేష్ అంబానీ రిలయన్స్ | Sensex ends 182 pts higher, Reliance mcap inches closer to Rs 10 lakh crore mark

The market valuation of Reliance Industries, the country's most valued firm, is fast nearing the ₹10 lakh crore mark helped by continuous rise in its share price.
Story first published: Wednesday, November 20, 2019, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X