For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, 3.78 లక్షల కోట్ల సంపద ఆవిరి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏకంగా 1145 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 50,000 పాయింట్ల దిగువన ముగిసింది. బడ్జెట్‌కు ముందు 46,000 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ బడ్జెట్ తర్వాత అంతకంతకూ ఎగిసి 52వేల పాయింట్లు దాటింది. ఇప్పుడు 49,744 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు రెండు శాతం మేర నష్టపోయాయి. మార్కెట్లు ఏ దశలోను కోలుకున్న సంకేతాలు కనిపించలేదు. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్స్, ఆటో స్టాక్స్ దెబ్బకొట్టాయి.

రూ.3.78 లక్షల కోట్ల సంపద ఆవిరి

రూ.3.78 లక్షల కోట్ల సంపద ఆవిరి

నేడు సెన్సెక్స్ ఉదయం 50,910.51 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,986.03 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,617.37 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,999.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,010.10 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,635.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 1145 పాయింట్లు (2.25 శాతం) నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద నేడు ఒక్కరోజే రూ.3.78 లక్షల కోట్లు క్షీణించింది. 1030 షేర్లు లాభాల్లో, 1942 షేర్లు నష్టాల్లో ముగియగా, 151 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాలు

ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాలు

ఆసియా మార్కెట్లు ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత మిశ్రమంగా కనిపించాయి. అప్పటికే నష్టాల్లో ఉన్న మన సూచీలు మరింత నష్టపోయాయి. వీటికి తోడు ఐటీ, వాహన, ఇంధన, విద్యుత్, PSU, రియాల్టీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది సూచీలపై ఒత్తిడిని పెంచింది. బడ్జెట్ తర్వాత భారీగా లాభపడ్డ సూచీలు దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో ఐదు సెషన్లుగా లాభాల స్వీకరణ కారణంగా నష్టపోతున్నాయి. మార్కెట్ స్థిరీకరణ దిశగా సాగుతోంది. మెటల్, టెలికం రంగాలు లాభాల్లో ఉండటంతో నష్టాలు తగ్గుతున్నాయి.

రంగాలవారీగా..

రంగాలవారీగా..

నిఫ్టీ 50 సూచీ 2.04 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.51 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 2.28 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.63 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.63 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.60 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.34 శాతం, నిఫ్టీ ఐటీ 2.89 శాతం, నిఫ్టీ మీడియా 3.42 శాతం, నిఫ్టీ ఫార్మా 2.55 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.55 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.80 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.75 శాతం నష్టపోయాయి. కేవలం నిఫ్టీ మెటల్ మాత్రం 1.60 శాతం లాభపడింది.

English summary

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, 3.78 లక్షల కోట్ల సంపద ఆవిరి | Sensex crashes 1,145 points, Rs 3.78 crore investor wealth erased

S&P BSE Sensex dived 1,145 points to end at 49,744. 50-stock NSE Nifty ended at 14,676, giving up the crucial support levels.
Story first published: Monday, February 22, 2021, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X