ఆర్బీఐ నిర్ణయాల ఎఫెక్ట్, సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 7) భారీ లాభాల్లో ఉన్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత ఆర్బీఐ పాలసీ అనంతరం భారీ లాభాల్లోకి వెళ్లాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దీనికి ఆర్బీఐ రెపో రేటు యథాతథంగా ఉంచడం వంటి నిర్ణయాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. 2021లో భారత జీడీపీ 12.5 శాతంగా ఉండవచ్చుననే ఐఎంఎఫ్ అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉన్నారు.

సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్
సెన్సెక్స్ ఉదయం 49,277.09 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,826.21 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,093.90 వద్ద కనిష్టాన్నితాకింది. క్రితం సెషన్‌లో 49,201 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 14,716.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,867.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,649.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి సెన్సెక్స్ 550.12 (1.12%) పాయింట్లు ఎగిసి 49,751 పాయింట్ల వద్ద, నిఫ్టీ 157.50 (1.07%) పాయింట్లు ఎగిసి 14,841 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్లకు పైగా ఎగిసింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.01 శాతం, JSW స్టీల్ 2.94 శాతం, SBI 2.91 శాతం, నెస్ట్లే 2.39 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2.37 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 2.15 శాతం, టాటా కన్స్ ప్రోడక్ట్స్ 1.10 శాతం, టీసీఎస్ 0.35 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.10 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.31 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.36 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.69 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.27 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.35 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.83 శాతం, నిఫ్టీ ఐటీ 0.08 శాతం, నిఫ్టీ మీడియా 0.80 శాతం, నిఫ్టీ మెటల్ 0.73 శాతం, నిఫ్టీ ఫార్మా 0.95 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.82 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.75 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.63 శాతం లాభపడ్డాయి.