For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, అడ్రస్‌లేని బ్యాంకింగ్ షేర్లు

|

ఉక్రెయిన్‌పై రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందడంతో, బ్యాంకింగ్ స్టాక్‌లు పడిపోయాయి. దీని కారణంగా సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారం ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ 2.14 శాతం లేదా 371.60 పాయింట్లు పతనమై 17,003.15 వద్దకు చేరుకోగా, ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్ 2.11 శాతం లేదా 1,227.85 పాయింట్లు క్షీణించి 56,925.07 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఓఎన్‌జీసీ రూ.170.90 వద్ద ప్రారంభమై మూడు రూపాయల మేరా లాభం గడించింది. ఇదే సమయంలో టీసీఎస్‌ షేర్లు కూడా రూ.3729.85 వద్ద ప్రారంభమై రూ.35 మేరా లాభపడ్డాయి. ఇక స్టీల్ రంగంకు చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర షేర్లు రూ.814.60తో ప్రారంభం కాగా రూ.39 మేరా నష్టాలు చవిచూశాయి. జేఎస్‌డబ్ల్యూ షేర్ల ధర గతవారం ముగింపుతో పోలిస్తే రూ.29 తగ్గి రూ.642 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఐసీసీఐ బ్యాంక్ షేరు రూ.32 వరకు తగ్గింది. ఈరోజు మార్కెట్లు ప్రారంభంకాగానే 758.95తో ట్రేడ్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రూ.94 తగ్గి రూ.2332.40తో ప్రారంభమయ్యాయి.

Sensex and Nifty crash heavily-here is the reason why

ABG షిప్‌యార్డ్‌ లిమిటెడ్ మరియు ఆ సంస్థ యొక్క ప్రమోటర్లు రుణదాతలను దాదాపుగా 228.42 బిలియన్ డాలర్లు మేరా మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో బ్యాంకు స్టాక్స్‌ పతనం దిశగా ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీలు 2.8శాతం మేరా పడిపోగా.. ప్రభుత్వరంగ బ్యాంకుల సూచీలు 3.5 శాతం మేరా పడిపోయాయి.

ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్‌ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద ఐపీఓ కోసం పేపర్లను సబ్మిట్ చేసింది. 5శాతం వాటాలను విక్రయించి 8 బిలియన్ డాలర్ల మేరా నిధులను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా విరాజిల్లుతున్న భారత్‌లో ఎల్ఐసీ నుంచి వస్తున్న ఐపీఓ అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.

English summary

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, అడ్రస్‌లేని బ్యాంకింగ్ షేర్లు | Sensex and Nifty crash heavily-here is the reason why

Indian shares crashed on Monday with various reasons impacting the investors..
Story first published: Monday, February 14, 2022, 11:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X