For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPI: ఆ ట్రేడింగ్‌లోకి కొత్తగా యూపీఐ పేమెంట్స్‌..

|

సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌ కోసం కొత్త చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విధానం ఎలా పనిచేస్తోందనే వివరాలను సెబీ నిన్న వెల్లడించింది. పెట్టుబడిదారుల నిధులను బ్రోకర్లు దుర్వినియోగం చేయకుండా కొత్త విధానం అడ్డుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే T+1 సెటిల్‌మెంట్‌ కు మారగా.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను ప్రపంచంలో మేటిగా తీర్చిదిద్దడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యూపీఐకి జై

యూపీఐకి జై

ఆర్బీఐ ఆమోదించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ను ఈ విధానంలో విరివిగా వినియోగించుకోనున్నట్లు సెబీ పేర్కొంది. సెకండరీ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం కోసం ఖాతాదారులు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నిధులను ముందుగా బ్రోకర్‌ కు బదిలీ చేస్తున్నారు. దీనికి బదులుగా స్వయంగా క్లియరింగ్ సంస్థకే బదలాయించే వీలు కొత్త విధానం ద్వారా కలగనుందని చెప్పింది. ఏవైనా సూచనలుంటే తెలపాలంటూ ప్రజాభిప్రాయం కోరింది.

నేరుగా క్లియరింగ్

నేరుగా క్లియరింగ్

మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. బ్రోకర్ల వద్ద 30,000 కోట్ల రూపాయలకు పైగా వినియోగదారుల నిధులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిపాదిత వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. బ్రోకర్‌ కు చెల్లించేందుకు బదులుగా పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలోనే అవి బ్లాక్‌ చేయబడతాయి. అక్కడి నుంచి నేరుగా క్లియరింగ్ కార్పొరేషన్‌కు బదిలీ అవుతాయి. ఈ విధానాన్ని ఏఎస్‌బీఏ అని పిలుస్తారు.

వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యం..

వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యం..

'స్టాక్ మార్కెట్‌ బ్రోకర్లు డీఫాల్ట్‌ కావడానికి విభిన్న కారణాలుండవచ్చు. వాటిలో ప్రధానమైనది ఖాతాదారుల నిధులు, సెక్యూరిటీలు దుర్వినియోగం చేయడం. తద్వారా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు నష్టం కలగడమే కాకుండా మార్కెట్‌పై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ తరహా సమస్యలు పరిష్కరించడానికి కొత్త వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగించి పరిస్థితికి అనుగుణంగా ముందస్తు హెచ్చరికలు జారీచేసే అవకాశం కలుగుతుంది' అని సెబీ తెలిపింది.

English summary

UPI: ఆ ట్రేడింగ్‌లోకి కొత్తగా యూపీఐ పేమెంట్స్‌.. | Sebi to introduce upi payments for secondary market trading

SEBI going to introduce upi payments into secondary market trading..
Story first published: Thursday, January 19, 2023, 7:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X