For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SEBI Fine: కో-లొకేషన్ స్కామ్ లో సెబీ భారీ పెనాల్టీలు.. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణియన్‌లకు కూడా..

|

SEBI Fine: క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై 'డార్క్ ఫైబర్' కేసులో రూ.7 కోట్ల జరిమానా విధించింది. దీనిని ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేస్ అని పిలుస్తారు. మార్కెట్ ఎక్స్ఛేంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి స్టాక్‌బ్రోకర్లకు సమాచారాన్ని సరిగ్గా ప్రసారం చేయలేదనే ఆరోపణల విషయంలో ఈ కేసు నడుస్తోంది.

కొందరు స్టాక్ బ్రోకర్లు ఎక్స్ఛేంజ్ సిస్టమ్‌కు ప్రిఫరెన్షియల్ యాక్సెస్ నుంచి లాభం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో స్టాక్ బ్రోకర్ల పాత్రపై దర్యాప్తు దృష్టి కేంద్రీకరించబడింది. ఎన్‌ఎస్‌ఈతో పాటు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల జరిమానా విధించింది.

SEBI Slapped heavy Fines On NSE And Former Chief Chitra Ramkrishna and anand subramaniyan in co-location scam

ఇది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంపార్క్ ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థకు రూ.3 కోట్లు, స్టాక్ బ్రోకర్ వే2వెల్త్ బ్రోకర్లకు రూ.6 కోట్ల పెనాల్టీని విధించినట్లు తాజా సెబీ ఆర్డర్ ద్వారా తెలుస్తోంది. W2W, GKN సంస్థల్లోని ఉద్యోగులు NSE, సంపార్క్‌ల ఉద్యోగులతో కుమ్మక్కై వారి వద్ద ఉన్న సర్వర్ల మిల్లీసెకన్ల జాప్యం ప్రయోజనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా అక్రమంగా గణనీయమైన లాభాలను ఆర్జించాయని సెబీ విచారణలో తేలింది.

ఈ విషయంలో జరిపిన విచారణ ప్రకారం.. సంపర్క్‌తో అనుసంధానించబడిన ఇతర ట్రేడింగ్ సభ్యులతో పోలిస్తే కొంతమంది స్టాక్ బ్రోకర్లు తక్కువ జాప్యం కలిగి ఉండే విధంగా సంపర్క్ కో-లొకేషన్‌లో కేబులింగ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పెనాల్టీలను ఆర్డర్ అందుకున్న 45 రోజుల్లోపు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

English summary

SEBI Fine: కో-లొకేషన్ స్కామ్ లో సెబీ భారీ పెనాల్టీలు.. చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణియన్‌లకు కూడా.. | SEBI Slapped heavy Fines On NSE And Former Chief Chitra Ramkrishna and anand subramaniyan in co-location scam

SEBI has imposed a penalty of 7 crores on National Stock Exchange in the co-location case
Story first published: Wednesday, June 29, 2022, 17:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X