For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షేర్ల కొనుగోలుకు మరో మార్గం, ఐపీవో చెల్లింపులకు పేమెంట్ బ్యాంక్స్!

|

పబ్లిక్ ఇష్యూలో షేర్లను కొనుగోలు చేయడానికి మరో చెల్లింపు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే యోచన చేస్తోంది మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ. ఐపీవోలకు దరఖాస్తు చేసేవారు, పేమెంట్ బ్యాంక్స్ ద్వారా కూడా చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పేమెంట్ బ్యాంక్స్ నియంత్రణ సంస్థ ఆర్బీఐతో సెబి సంప్రదింపులు జరుపుతోందట. ఈ ప్రతిపాదనకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందే ఐపీవో దరఖాస్తుదారుల నుండి పేమెంట్స్ బ్యాంకులు చెల్లింపులు స్వీకరించేందుకు సెబి అనుమతులు జారీ చేస్తుంది.

ప్రస్తుతం దేశంలో ఆరు పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇందులో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఫినో పేమెంట్ బ్యాంక్, జియో పేమెంట్ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, ఎన్ఎస్డీఎల్ పేమెంట్ బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. డిపాజిట్లు స్వీకరించడం, నెట్ బ్యాంకింగ్, నగదు బదలీ వంటి సేవల్ని అందిస్తున్నాయి.

SEBI may open one more avenue for retail investor to buy shares in IPOs

రిస్క్ రుణాలు, క్రెడిట్ కార్డుల మంజూరు వంటి వ్యాపారాల నిర్వహణకు, ఐపీఓ చెల్లింపులు తీసుకోడానికి వీటికి అనుమతిలేదు. ఐపీఓ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళీకరించేందుకు, చిన్న నగరాల్లోని ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేలా చేసేందుకు పేమెంట్స్ బ్యాంక్స్‌కు ఐపీఓ చెల్లింపులు స్వీకరించేలా అనుమతులు ఇవ్వాలని సెబీ యోచిస్తోంది.

English summary

షేర్ల కొనుగోలుకు మరో మార్గం, ఐపీవో చెల్లింపులకు పేమెంట్ బ్యాంక్స్! | SEBI may open one more avenue for retail investor to buy shares in IPOs

India’s capital markets regulator may open one more avenue for individual investors to pay for shares offered in initial public offerings (IPOs) by allowing payments banks to accept money from IPO applicants.
Story first published: Thursday, June 10, 2021, 17:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X