For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani group: బిగ్‌షాట్‌కు బిగ్‌షాక్: బాంబు పేల్చిన ఆర్థికమంత్రి: పడిపోయిన షేర్లు

|

ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం.. కరోనా సంక్షోభ సమయంలోనూ తన ఆస్తులను అపారంగా పెంచుకోగలిగిన కొమ్ములు తిరిగిన కార్పొరేట్ బిగ్‌షాట్.. గౌతమ్ అదానికి కేంద్ర ప్రభుత్వం బిగ్‌షాక్ ఇచ్చింది. అలాంటి ఇలాంటి షాక్ కాదది. గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లోని కొన్ని సంస్థలపై సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) దర్యాప్తు సాగిస్తోంది. సెబి రూపొందించిన కొన్ని మార్గదర్శకాలు, రెగ్యులేషన్లను ఉల్లంఘించిన కారణంగా అదాని గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు సెబి రాడార్‌ పరిధిలోకి వెళ్లిపోయాయి. రెగ్యులేషన్ల ఉల్లంఘనపై సమగ్ర విచారణ సాగుతోంది.

డీఆర్ఐ.. సెబి ఉమ్మడి దర్యాప్తు..

డీఆర్ఐ.. సెబి ఉమ్మడి దర్యాప్తు..

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా వెల్లడించారు. ఈ ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెబి సంయుక్తంగా ఈ దర్యాప్తును చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇందులో భాగస్వామ్యం కావట్లేదని చెప్పారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు కలిగి ఉన్న కొన్ని కంపెనీలు రెగ్యులేషన్లను అతిక్రమించినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టామని అన్నారు.

 లిస్టెడ్ కంపెనీల్లో..

లిస్టెడ్ కంపెనీల్లో..

భారత్‌లో లిస్టెడ్ అయిన కంపెనీు గ్లోబల్ డిపాజిటరీ రీసీప్ట్ (జీడీఆర్)లకు సంబంధించి జారీ చేసిన కొన్ని అంశాలపై సెబి ఇదివరకు దర్యాప్తుకు ఆదేశించినందని కేంద్రమంత్రి తెలిపారు. 2016 జూన్ 16వ తేదీన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన అకౌంట్లను స్తంభింపజేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మొత్త ఆరు లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్, అదాని ట్రాన్స్‌మీషన్, అదాని టోటల్ గ్యాస్, అదాని గ్రీన్, అదాని పోర్ట్స్, అదాని పవర్..ఇవన్నీ లిస్టెడ్ కంపెనీలే.

 ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లపై

ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లపై

కొన్ని విదేశీ కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ లిమిటెడ్, క్రెస్టా ఫండ్ లిమిటెడ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ లిమిటెడ్‌కు చెందిన అకౌంట్లను ఇదివరకే సెబి స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. వాటిని తోసిపుచ్చుతూ ఎన్‌ఎస్‌డీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. వాటిని ఫ్రీజ్ చేయలేదంటూ వివరణ ఇచ్చింది. ఇక తాజాగా- కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి చేసిన ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్రమంత్రి ప్రకటన వెలువడిన వెంటనే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్లు పడిపోయాయి.

క్షీణించిన అదాని షేర్లు..

క్షీణించిన అదాని షేర్లు..

నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో అదాని గ్రూప్ కంపెనీల షేర్ల విలువ 3.83 శాతానికి క్షీణించాయి. అదాని పవర్ స్టాక్ ట్రేడింగ్‌లో 3.83 శాతం మేర క్షీణత కనిపించింది. ఒక్కో షేరు విలువలో 4.05 పైసల మేర పడిపోయింది. రూ.101.60 పైసల వద్ద నిలిచింది. అదాని పోర్ట్స్ షేరు విలువ 2.47 శాతం దిగజారింది. రూ.16.95 పైసల మేర క్షీణతను నమోదు చేసింది. రూ. 670.65 పైసల వద్ద నిలిచింది. అదాని గ్రీన్ స్టాక్ విలువలో 3.24 శాతం క్షీణత రికార్డయింది. 976 రూపాయల వద్ద నిలిచింది. అదాని ఎంటర్‌ప్రైజెస్ విలువ 1.74 శాతం మేర తగ్గింది. రూ.24.35 పైసల మేర తగ్గి.. రూ.1,371.15 పైసల వద్ద నిలిచింది.

English summary

Adani group: బిగ్‌షాట్‌కు బిగ్‌షాక్: బాంబు పేల్చిన ఆర్థికమంత్రి: పడిపోయిన షేర్లు | SEBI investigating Adani group companies over regulatory compliance: MoS Finance

Minister of State for Finance Pankaj Chaudhary said in Parliament today that the directorate of revenue intelligence and SEBI are probing some entities of the Adani group about compliance with the regulations.
Story first published: Monday, July 19, 2021, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X