For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో కీలక నిర్ణయం, ఆ సంస్థకే భారం: వొడాఫోన్ ఐడియాకు లబ్ధి

|

తన కస్టమర్లకు రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. కొత్త ఏడాదిలో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇంటర్ యూసేజ్ ఛార్జీలు(IUC) ఛార్జీలను తొలగించింది. ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది. దేశీయంగా జియో సిమ్ కార్డ్ నుంచి ఏ ఇతర మొబైల్ కంపెనీల మొబైల్ ఫోన్ల‌కు ఫోన్ కాల్ చేసినా ఎలాంటి ఛార్జీ ఉండదని, అవన్నీ ఉచితమేనని రిలయన్స్ జియో తెలిపింది. అన్ లిమిటెడ్ ఫ్రీ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది. జియో నిర్ణయంతో టెల్కోలపై ప్రభావం పడనుంది. అయితే ఒక్కో టెల్కోపై ఒక్కో రమైన ప్రభావం ఉండనుంది.

జియో రిసీవర్, వీఐ పేయర్

జియో రిసీవర్, వీఐ పేయర్

జియో IUC ఛార్జీలను తొలగించడంతో స్వయంగా ఈ టెల్కోకు భారం కానుందని, అదే సమయంలో వొడాఫోన్ ఐడియాకు ప్రయోజనం చేకూరనుందని, ఎయిర్‌టెల్ పైన పెద్దగా ప్రభావం చూపదని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడియ్ సూయిజ్ అంచనా వేసింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం IUC విధానం జనవరి 1వ తేదీతో ముగిసింది. దీంతో ఇకపై తమ నెట్ వర్క్ నుండి ఇతర నెట్ వర్క్స్‌కు చేసే కాల్స్ పూర్తిగా ఉచితమని జియో తెలిపింది. అంతకుముందు ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ చస్తే నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాల్సి వచ్చేది. ఇటీవలి కాలంలో జియోకు భారీగా సబ్‌స్క్రైబర్లు పెరిగారు. దీంతో జియో నెట్ రిసీవర్‌గా, వొడాఫోన్ ఐడియా(VI) నెట్ పేయర్‌గా నిలిచింది.

జియోకు ఆదాయం తగ్గవచ్చు

జియోకు ఆదాయం తగ్గవచ్చు

జియో ప్రస్తుతం తన ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లో ఆఫ్ నెట్ కాల్స్ పైన పరిమితి విధిస్తోంది. తాజా ప్రకటన నేపథ్యంలో ప్లాన్‌లో మార్పులు లేకుండా ఆఫ్ నెట్ కాల్స్ పైన పరిమితిని తొలగిస్తుందని అంచనా వేస్తోంది. కంపెనీ ఐసీయూ టాపప్స్ నిరుపయోగమే. వీఐ, ఎయిర్ టెల్ ప్లాన్స్ విషయంలో ఆఫ్ నెట్ కాల్స్ పైన పరిమితులు లేవు. దీంతో ఐయూసీ ఛార్జీల రద్దు జియోపై ప్రభావం పడవచ్చు. బిజినెస్ టు బిజినెస్ పరంగా జియోకు ఆదాయం తగ్గే అవకాశముంది. అదే సమయంలో వీఐకి లబ్ధి చేకూరవచ్చు.

టాప్ వన్‌లో జియో

టాప్ వన్‌లో జియో

కాగా, 2016లో వచ్చిన జియో వేగంగా టాప్ వన్ స్థానంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ నాటికి ఎయిర్‌టెల్ చందాదారులు 33.028 కోట్లకు చేరుకున్నారు. యో కస్టమర్లు అక్టోబర్ ముగిసే నాటికి 40.635 కోట్లు. అక్టోబర్ నాటికి వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 29.283 కోట్లకు తగ్గింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య 11.888 కోట్లుగా ఉంది.

English summary

జియో కీలక నిర్ణయం, ఆ సంస్థకే భారం: వొడాఫోన్ ఐడియాకు లబ్ధి | Scrapping of IUC levy benefit for Vodafone Idea, neutral for Airtel, some impact for Jio

The elimination of inter-operator IUC charges may result in certain EBITDA gains for Vodafone Idea and some impact for Jio, while it will be neutral for Airtel, according to a report. The zero IUC (Interconnect Usage Charges) regime was previously slated to come into effect from January 2020, but then the telecom regulator deferred its implementation till January 1, 2021.
Story first published: Friday, January 1, 2021, 19:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X