ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్వరలో యోనో మర్చంట్ యాప్‌ను తీసుకురానుంది. దీనిని SBI అనుబంధ సంస్థ ఎస్బీఐ పేమెంట్స్ తీసుకురానుంది. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశంలో డిజిటలైజేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో PoS మౌలిక సదుపాయాలను ప్రోత్సహించేందుకు, కొనుగోలుదారులకు ఊతమిచ్చేందుకు తీసుకు వస్తున్నారు.

యోనో మర్చంట్ యాప్ పేరుతో...
ఎస్బీఐ పేమెంట్స్... యోనో మర్చంట్ యాప్ పేరుతో ఈ సేవలను విడుదల చేయాలని భావిస్తోంది. మొబైల్ ఆధారిత టెక్నాలజీతో అతి తక్కువ విలువ కలిగిన డిజిటల్ చెల్లింపులన కోసం వ్యాపారుల్ని సన్నద్ధం చేసే లక్ష్యంలో భాగంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. యోనో మర్చంట్ యాప్‌తో దేశంలో మర్చంట్ చెల్లింపుల డిజిటైజేషన్‌ను విస్తరించే అవకాశం లభిస్తుందని తెలిపింది. వచ్చే రెండేళ్లలో రిటైల్, ఎంటర్‌ప్రైజ్ విభాగంలో దేశవ్యాప్తంగా రెండుకోట్ల మంది వ్యాపారుల్ని ఈ యాప్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తృతీయ శ్రేణి పట్టణాల్లో...
తృతీయశ్రేణి పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఎస్పీఐ తెలిపింది. గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ సంస్థ వీసాతో కలిసి యోనో ఎస్పీఐ మర్చంట్ POS (పాయింట్ ఆఫ్ సేల్)గా వ్యవహరిస్తుందని ఎస్బీఐ తెలిపింది. ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (PIDF)లో భాగంగా దీనిని తీసుకు వస్తున్నట్లు తెలిపింది.

ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా..
వచ్చే రెండేళ్లలో లాయాల్టీ, జీఎస్టీ ఇన్వాయిసింగ్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ వంటి సేవలను యాక్సెస్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్స్‌ను PoS డివైజ్‌లోకి అప్-గ్రేడ్ చేయడం ద్వారా లక్షలాది మంది వ్యాపారులను డిజిటలైజ్ చేయాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇతర బ్యాంకింగ్ ఉత్పత్తులను పొందవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications