For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సోకిన వారికి ఊరట, SBI కవచ్ పర్సనల్ లోన్

|

కరోనా పేషెంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కవచ్ పర్సనల్ లోన్ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. వడ్డీ రేటు కూడా కేవలం 8.5 శాతానికి మంజూరు చేస్తోంది. ఎలాంటి తనఖా కూడా అవసరం లేదు. వ్యక్తిగత రుణ విభాగంలో ఇప్పటి వరకు ఇదే కనిష్ట వడ్డీ రేటు అని బ్యాంకు చెబుతోంది.

అరవై నెలల కాలపరిమితితో కూడిన ఈ రుణంపై మూడు నెలల వరకు మారటోరియం ఆఫర్ చేస్తోంది. వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యులు కరోనా చికిత్స అవసరాల కోసం ఈ రుణాన్ని పొందవచ్చును. ఈ రుణ పథకంలో ఇప్పటికే వెచ్చించిన కరోనా వైద్య ఖర్చులకు రీయింబర్సుమెంట్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది ఎస్బీఐ.

SBI offer Kavach personal loans for Covid 19 patients

కరోనా బారిన పడుతున్న వారికి ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా తెలిపారు. వేతనజీవులు కాని వారికి కూడా ఈ రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

English summary

కరోనా సోకిన వారికి ఊరట, SBI కవచ్ పర్సనల్ లోన్ | SBI offer Kavach personal loans for Covid 19 patients

SBI on Friday came up with a new loan offering Kavach Personal Loan to provide relief to its customers who are facing financial challenges due to covid related treatment costs.
Story first published: Saturday, June 12, 2021, 12:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X