కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్, ఆ వడ్డీ రేట్లు పెంపు: ఎన్ని రోజులకు ఎంత పెరిగాయంటే?
ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేట్లను సవరించింది. జనవరి 2021 నుండి ఈ ప్రభుత్వరంగ దిగ్గజం వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. సురక్షిత పెట్టుబడుల్లో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ముఖ్యమైనది. పెట్టుబడి కోసం చాలామంది దీనిని ఎంచుకుంటారు. వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలించి కూడా ఇన్వెస్ట్ సాధనంగా ఉపయోగించుకుంటారు. FD పైన రిటర్న్స్ ఎంత ఉంటాయో ముందే లెక్క వేసుకోవచ్చు. FDని టర్మ్ డిపాజిట్‌గా కూడా చెబుతారు. తాజాగా ఎస్బీఐ ఈ FD వడ్డీ రేట్లను తగ్గించింది.
ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, వడ్డీరేటుపై రాయితీ: హోంలోన్ తీసుకుంటున్నారా, ఎస్బీఐ గుడ్‌న్యూస్

వివిధ వడ్డీ రేట్లు ఇలా...
SBI తాజా సవరణ అనంతరం FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
7 రోజుల నుండి 45 రోజుల వరకు ఇప్పుడు 2.9% వడ్డీ రేటు ఉంది.
46 రోజుల నుండి 179 రోజుల వరకు 3.9%,
180 రోజుల నుండి 1 సంవత్సరం వరకు 4.4%,
1 ఏడాది కాలం నుండి 2 ఏళ్ల లోపు మెచ్యూరిటీ పైన 10 బీపీఎస్ పాయింట్లు పెరిగాయి. అంటే ఇప్పటి వరకు 4.9 శాతంగా ఉన్న వడ్డీ ఇప్పుడు 5%,
2 ఏళ్ల కాలపరిమితి నుండి 3 ఏళ్ల వరకు 5.1%,
3 ఏళ్ల కాలపరిమితి నుండి 5 ఏళ్ల వరకు 5.3%,
5 ఏళ్ల కాలపరిమితి నుండి 10 ఏళ్ల వరకు 5.4% అందిస్తోంది.

సీనియర్ సిటిజన్స్ కోసం...
సీనియర్ సిటిజన్స్ 5bps అదనంగా అందిస్తోంది ఎస్బీఐ.
ఏడు రోజుల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై 3.4 శాతం నుండి 6.2 శాతం అందిస్తోంది.
7 రోజుల నుండి 45 రోజుల వరకు ఇప్పుడు 3.4% వడ్డీ రేటు ఉంది.
46 రోజుల నుండి 179 రోజుల వరకు 4.4%,
180 రోజుల నుండి 1 సంవత్సరం వరకు 4.9%,
1 ఏడాది కాలం నుండి 2 ఏళ్ల లోపు మెచ్యూరిటీ పైన 5.4% అందిస్తోంది.
2 ఏళ్ల కాలపరిమితి నుండి 3 ఏళ్ల వరకు 5.6%,
3 ఏళ్ల కాలపరిమితి నుండి 5 ఏళ్ల వరకు 5.8%,
5 ఏళ్ల కాలపరిమితి నుండి 10 ఏళ్ల వరకు 6.2% అందిస్తోంది.

ఎప్పటి నుండి అమల్లోకి..
SBI తాజాగా సవరించిన FD వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుండి అమలులోకి వస్తాయి. రూ.2 కోట్ల లోపు రిటైల్ FD డిపాజిట్ల పైన ఇది వర్తిస్తుంది. కాగా, ప్రభుత్వరంగ దిగ్గజం SBI హోమ్ లోన్ వడ్డీ రేటు పైన 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ, ప్రాసెసింగ్ ఫీజు పైన 100 శాతం మాఫీ వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త హోమ్ లోన్ వడ్డీ రేట్లు సిబిల్ స్కోర్‌తో అనుసంధానించబడి రూ.30 లక్షల వరకు హోమ్ లోన్ పైన 6.80 శాతం నుండి ప్రారంభమవుతాయి. రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్ పైన 6.95 శాతం వడ్డీ రేటు నుండి ప్రారంభమవుతాయి.