ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ, అదే సమయంలో రెపో రేటు ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేట్లు 30 బేసిస్ పాయింట్స్ వరకు పెంచిన విషయం తెలిసిందే. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. ఎస్బీఐ పెంచిన వడ్డీ రేటు కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారికి వర్తిస్తుంది. రెండు రోజుల క్రితం ఎంసీఎల్ఆర్ ఆధారిత హోమ్ లోన్స్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గత నెలలో రెపో రేటుపై 75 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. తాజాగా 20 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఎన్ని బేసిస్ పాయింట్స్ పెరిగిందంటే
ఇవి మే 1వ తేదీ నుండే అమలులోకి వచ్చాయి. అంతకుముందు ఈ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ కంటే 15 నుండి 50 బేసిస్ పాయింట్స్ అదనంగా ఉంటే, మే 1వ తేదీ నుండి 35 నుండి 70 బేసిస్ పాయింట్స్ అదనంగా ఉంటుంది. ఉదాహరణకు మే 1వ తేదీ తర్వాత ఎస్బీఐలో రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే కనీసం 7.40 శాతం వడ్డీ రేటు ఉంటుంది. గతంలో ఇది 7.20 శాతంగా ఉంది. మహిళలకు గతంలో 7.15 శాతం ఉండగా, ఇప్పుడు 7.35 శాతం ఉంటుంది.

బెంచ్ మార్క్ రేటులో మార్పు లేదు
అయితే రెపో లింక్డ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు 7.05 శాతంలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల రెపో రేటు భారీగా తగ్గడంతో ఆదాయంపై దృష్టి పెట్టి బ్యాంకు వడ్డీ రేటు పెంచినట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారికి నష్టం లేదు. కొత్తగా తీసుకునే వారికి 20 బేసిస్ పాయింట్స్ నుండి 30 బేసిస్ పాయింట్స్ అదనంగా చెల్లించాలి.

ఎంతమొత్తానికి ఎంత పెంచారంటే?
రూ.30 లక్,ల హోమ్ లోన్ తీసుకుంటే 20 బేసిస్ పాయింట్స్ పెరిగి 7.20 శాతం నుండి 7.40 శాతం అవుతుంది. రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెంచారు. రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్ తీసుకుంటే 7.55 శాతం నుండి 7.75 శాతానికి పెంచారు.

ప్రాపర్టీ లోన్ పైన 30 బేసిస్ పాయింట్స్ పెంపు
అలాగే ప్రాపర్టీ పైన తీసుకునే లోన్ పైన 30 బేసిస్ పాయింట్స్ పెంచింది ఎస్బీఐ. రూ.1 కోటి వరకు లోన్ తీసుకుంటే ఇదివరకు 8.90 శాతం ఉండగా ఇప్పుడు 9.20 శాతానికి పెంచింది. రూ.1 కోటి నుండి రూ.2 కోట్లు లోన్ తీసుకుంటే 9.40 శాతం నుండి 9.70 శాతానికి పెంచింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications