For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI తర్వాత వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

|

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోజనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) తదితర బ్యాంకులు కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అంతే స్థాయిలో వడ్డీ రేట్లు తగ్గించింది.

3 నెలలు EMI కట్టక్కర్లేదు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా? 8 కీలక అంశాలు తెలుసుకోండి3 నెలలు EMI కట్టక్కర్లేదు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలా? 8 కీలక అంశాలు తెలుసుకోండి

SBI వడ్డీ రేటు తగ్గింపు

SBI వడ్డీ రేటు తగ్గింపు

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన కొన్ని గంటల్లోనే ఎస్బీఐ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు రిటైల్, బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా 20 బేసిస్ పాయింట్ల నుండి 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.

తగ్గింపు ఇలా..

తగ్గింపు ఇలా..

ఎస్బీఐ ఈ నిర్ణయంతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేటు (EBR), రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో (RLR) అనుసంధానమై అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు మరింత తగ్గనుంది. దీంతో EBR రేటు 7.80% నుంచి 7.05% తగ్గనుండగా, RLR 7.40% నుంచి 6.65% దిగిరానుంది. బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంతో 30 ఏళ్ల కాలపరిమితి కలిగిన లక్ష రూపాయల రుణంపై ఈఎంఐ రూ.52 తగ్గనుంది.

75 బేసిస్ పాయింట్లు తగ్గించిన BOI

75 బేసిస్ పాయింట్లు తగ్గించిన BOI

బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లను తగ్గించనుంది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌కు అనుసంధానమైన రుణ రేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో కొత్త రుణ రేటు 7.25 శాతానికి దిగి వస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రుణ రేట్, ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానమై ఉంది.

లాభం చేకూరుతుంది.. BOI

లాభం చేకూరుతుంది.. BOI

'ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి వార్షిక రేటును 7.25 శాతానికి తీసుకొచ్చాం. దీనివల్ల రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తగ్గించిన రెపో రేటు ప్రయోజనాన్ని ఖాతాదారులకు యథాతథంగా ఇస్తున్నాం. మా గృహ, వాహన రుణ గ్రహీతలతోపాటు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కస్టమర్లకు లాభం చేకూరగలదు' అని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (MCLR) రేటును కూడా బ్యాంకు 25 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది. ఏడాది నుండి నెల రోజుల కాల వ్యవధిపై ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఏడాది MCLR ప్రస్తుతం 7.95% ఉంది.

English summary

SBI తర్వాత వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా | SBI cuts lending rate by 75 bps, BOB cuts interest rate

SBI has passed on the entire cut in interest rates by the RBI to its borrowers by bringing down its external benchmark-linked lending rate as well as the repo-linked lending rate by 75 basis points from April 1.
Story first published: Monday, March 30, 2020, 8:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X