For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఛార్జీ నుండి గ్యాస్ వరకు: జూలై 1వ తేదీ నుండి చోటు చేసుకోనున్న 7 కీలక మార్పులు

|

వచ్చే నెల ఒకటో తేదీ(జూలై 1) నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలు, పన్ను చెల్లింపుల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బేసిక్ సేవింగ్స్ డిపాజిట్స్ పైన సర్వీస్ ఛార్జీలు పెంచనుంది. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధనలు మారనున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరతో పాటు పన్ను విధానాల్లో మార్పులు వస్తున్నాయి. జూలై ఒకటో తేదీ నుండి రానున్న మార్పుల్లో కొన్ని ఇక్కడ చూద్దాం...

ఎస్బీఐ ఏటీఎం నగదు ఉపసంహరణ చార్జీలు

ఎస్బీఐ ఏటీఎం నగదు ఉపసంహరణ చార్జీలు

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు నాలుగు ఉచిత నగదు ట్రాన్సాక్షన్స్ అందిస్తోంది. ఈ ఉచిత ట్రాన్సాక్షన్స్ అనంతరం ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ.15 ఛార్జీ వసూలు చేస్తోంది.

- ఎస్బీఐ సేవింగ్ బ్యాంక్ హోల్డర్లు జూలై 1వ తేదీ నుండి పరిమితమైన ఉచిత చెక్ లీఫ్ వినియోగం ఉంటోంది. ఈ మేరకు బ్యాంకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఓ ఫైనాన్షియల్ ఇయర్‌లో 10 చెక్ లీవ్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ పరిమితి మించితే ప్రతి 10 లీవ్స్‌కు రూ.40 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తారు. 25 లీవ్స్‌కు రూ.75 ప్లస్ జీఎస్టీ. అయితే సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.

గ్యాస్ సిలిండర్ నుండి ఐటీ రిటర్న్స్

గ్యాస్ సిలిండర్ నుండి ఐటీ రిటర్న్స్

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల మొదటి రోజున సవరిస్తారు. చమురు కంపెనీలు అలాంటి అధికారిక ప్రకటనలు చేయనప్పటికీ జూలై 1వ తేదీన ధరలను సవరిస్తాయి.

గత రెండేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి టీడీఎస్ రేటుతో మినహాయించిన అధిక పన్నును వచ్చే నెల నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు విలీనం నేపథ్యంలో కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వర్తిస్తుంది. ట్రాన్సాక్షన్స్ సజావుగా జరిగేలా కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ పొందాలని సిండికేట్ బ్యాంకు తన ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.

సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన చెక్కు బుక్స్

సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన చెక్కు బుక్స్

- ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో కలిశాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు సెక్యూరిటీ ఫీచర్స్ కలిగిన కొత్త చెక్కు బుక్స్ తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఉన్న చెక్కు బుక్స్ జూలై 1వ తేదీ నుండి చెల్లవు. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులో విలీనం చేయబడ్డాయి.

- హీరో మోటా కార్ప్ వచ్చే నెల నుండి ధరలు పెంచనుంది.

English summary

SBI ఛార్జీ నుండి గ్యాస్ వరకు: జూలై 1వ తేదీ నుండి చోటు చేసుకోనున్న 7 కీలక మార్పులు | SBI charges to cheque book: Crucial changes to come into effect from July 1

For SBI customers, a lot of changes will be taking place with the change of month from 1st July 2021.
Story first published: Sunday, June 27, 2021, 20:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X