For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI లైఫ్ సర్టిఫికెట్‌ను వీడియో కాల్ ద్వారా ఇలా సమర్పించండి, పాన్ తప్పనిసరి..

|

పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీ నుండి లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ ధృవపత్రాన్ని సమర్పించాలి. పెన్షన్ ద్వారా ఆదాయం పొందేవారు తమ ఖాతా కలిగిన బ్యాంకు, పోస్టాఫీస్, సంబంధిత పెన్షన్ కార్యాలయం వద్ద లేదా జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో ఈ సర్టిఫికెట్ సమర్పించవలసి ఉంటుంది. అయితే వృద్ధులకు ఇలా బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లను సందర్శించడం ఇబ్బందికరమైన అమశమే. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులో ఖాతా కలిగిన పెన్షన్‌దారులు వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. దేశంలో మొదటిసారి వీడియో లైఫ్ సర్టిఫికెట్ సదుపాయాన్ని నవంబర్ 1, సోమవారం నాడు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇంటి వద్ద నుండే ఈ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. ఈ లైఫ్ సర్టిఫికెట్‌ను ఎలా సమర్పించవచ్చునో దశలను వివరిస్తూ ఎస్బీఐ ట్వీట్ చేసింది.

- తొలుత www.pensionseva.sbi పోర్టల్‌ను సందర్శించాలి.

- వీడియో లైఫ్ సర్టిఫికెట్ ప్రాసెస్ కోసం వీడియో ఎల్‌సీ పైన క్లిక్ చేయాలి.

 SBI allows Life Certificate submission through video call

- ఎస్బీఐ పెన్షన్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్‌ను కూడా ఎంటర్ చేసి, Submit పైన క్లిక్ చేయాలి.

- టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను ఆమోదించిన తర్వాత Start Journey పైన క్లిక్ చేయాలి.

- మీరు మీ చెంతన ఒరిజినల్ పాన్ కార్డ్‌ను సిద్దంగా ఉంచుకోవాలి. I am ready పైన క్లిక్ చేయాలి.

- వీడియో కాల్‌ను ప్రారంభించేందుకు మీ అనుమతి అవసరం. ఒకసారి అనుమతి వచ్చిందంటే చాలు, ఆ తర్వాత మీరు ఎస్బీఐ అధికారితో మీరు సంభాషించేందుకు సిద్ధంగా ఉండాలి.

- మీకు ఇక్కడ మరో సౌకర్యం కూడా ఉంది. మీరు ఆప్షన్‌లో భాగంగా సమయాన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. మీకు వీలు కలిగిన సమయాన్ని కోరవచ్చు.

- వీడియో కాల్‌లోకి వచ్చిన ఎస్బీఐ అధికారి మీ స్క్రీన్ పైన ఉన్న నాలుగు అంకెల ధృవీకరణ కోడ్‌ను చదవాలని కోరుతారు. ఆ కోడ్‌ను చదవవలసి ఉంటుంది.

- మీ పాన్ కార్డును బ్యాంకు అధికారికి చూపించాలి. దానిని ఫోటో తీయడానికి అనుమతి ఇవ్వవలసి ఉంటుంది. వీడియో కాల్ సమయంలో ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం రాదు. కానీ పాన్ కార్డు మాత్రం తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి.

- వీడియో కాల్ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఏ కారణం చేతనైన మీ వీడియో లైఫ్ సర్టిఫికెట్ తిరస్కరణకు గురయితే ఎస్సెమ్మెస్ వస్తుంది. ఎస్సెమ్మెస్ ద్వారా బ్యాంకు మీకు తెలియజేస్తుంది. అలాంటి ఇబ్బంది తలెత్తితే మీరు బ్యాంకు బ్రాంచీలో సందర్శించి లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేయవచ్చు.

English summary

SBI లైఫ్ సర్టిఫికెట్‌ను వీడియో కాల్ ద్వారా ఇలా సమర్పించండి, పాన్ తప్పనిసరి.. | SBI allows Life Certificate submission through video call

The SBI has launched Video Life Certificate (VLC) facility for pensioners. The bank said in a statement tody that this facility has been launched with an aim to offer seamless life certificate submission experience for millions of pensioners.
Story first published: Monday, November 1, 2021, 20:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X