For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1.05 లక్షల కోట్లకు చేరుకున్న సుకన్య సమృద్ధి యోజన సేవింగ్స్

|

బాలికల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన సుకన్య సమృద్ధి యోజన(SSY)కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య 40 శాతానికి పైనే వృద్ధి నమోదు చేసింది. 2020 మే నెల చివరి నాటికి ఈ స్కీంలో రూ.75,522 కోట్ల పెట్టుబడి ఉండగా, 2021 మే నెల నాటికి ఈ మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మేరకు నేషనల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ గణాంకాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఈ స్కీంలో 7.6 శాతం వడ్డీ ఉంది. స్మాల్ సేవింగ్స్ స్కీంలలో ఇది గరిష్ఠ వడ్డీ రేటు. 2015 జనవరిలో తీసుకు వచ్చిన ఈ పథకంలో పదేళ్ల లోపు వయసున్న బాలికల పేరుతో ఖాతా ప్రారంభించే అవకాశముంది. నెల నెలా లేదా ఏడాదికి ఓసారి ఈ ఖాతాలో సొమ్ము జమ చేయొచ్చు. గరిష్ఠంగా పదిహేనేళ్ల పాటు పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంది. అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చాక నిబంధనల మేరకు డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

Savings under SSY stood at RS 1.05 lakh crore at May end

సుకన్య సమృద్ధి యోజన (SSY) ప్రభుత్వ ప్రత్యేక పెట్టుబడి పథకం. ఇది ఆడపిల్లల కోసం ఉద్దేశించిన పథకం. దీనికి EEE వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద SSY పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.

English summary

రూ.1.05 లక్షల కోట్లకు చేరుకున్న సుకన్య సమృద్ధి యోజన సేవింగ్స్ | Savings under SSY stood at RS 1.05 lakh crore at May end

As per data available with National Savings Institute as on May end the amount saved by people under Sukanya Samriddhi Scheme (SSY) May 2021 stood at ₹1.05 lakh crores. SSY is one of the most popular small saving schemes for the girl child.
Story first published: Monday, July 5, 2021, 13:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X