For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపీవోకు ఆరామ్‌కో: ప్రపంచంలో అతిపెద్ద ఐపీవో, యువరాజు అసంతృప్తి వల్లే...

|

రియాద్: సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ ఆరామ్ కో ఐపీవోకు వస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. కంపెనీలోని కొన్ని వాటాలను ఐపీవోకు తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్లుగా సౌదీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీవోకు వెళ్లేందుకు గత శుక్రవారం ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అనుమతి తెలిపారు. ఆదివారం దానిని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద ఐపీవో కావొచ్చునని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఐపీవో ద్వారా 22 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది.

వచ్చే నెలలో ఆరామ్ కో షేర్లు సౌదీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ నెలలోనే ఐపీవో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సౌదీ యువరాజు కంపెనీ మార్కెట్ వ్యాల్యూపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆలస్యమైంది. ప్రపంచ చమురు మార్కెట్లో సౌదీ ఆరామ్ కో వాటా 10 శాతంగా ఉంటుంది.

ఆ 3 కలిసినా దిగదుడిపే: ప్రపంచంలో అత్యంత లాభదాయక సంస్థతో అంబానీ జట్టుఆ 3 కలిసినా దిగదుడిపే: ప్రపంచంలో అత్యంత లాభదాయక సంస్థతో అంబానీ జట్టు

చమురేతర ఆదాయ మార్గాలపై కన్ను..

చమురేతర ఆదాయ మార్గాలపై కన్ను..

ఆరామ్ కో ఐపీవో ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ ఆపరేషన్స్‌తో పాటు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు తరలించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. చమురు ఆధారిత దేశమైన సౌదీ.. ఇతర ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఏర్పాటు చేసింది. వీటిని ఉబర్‌తో పాటు పునరుత్పాదక రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తోంది.

త్వరలో ఐపీవో వివరాలు...

త్వరలో ఐపీవో వివరాలు...

ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఆరామ్ కో 2016లో ఐపీఓకు రావాలని భావించింది. వివిధ కారణాలతో వాయిదా పడుతోంది. ఇప్పుడు ఐపీవోకు వస్తోంది. బుక్ బిల్డింగ్ విధానాలలో షేర్లను జారీ చేస్తారు. ఆఫర్ ధరను, ఎన్ని షేర్లను విక్రయించేది ఈ బుక్‌ బిల్డింగ్ పీరియడ్ చివరలో ప్రకటిస్తామన్నారు. ఈ ఐపీఓకు సంస్థాగత ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సౌదీవాసులు, సౌదీలో ఉంటున్న విదేశీయులు, ఇతర గల్ఫ్‌వాసులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 9న ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది. షేర్ల ట్రేడింగ్‌ సౌదీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో వచ్చే నెల మొదలు కావొచ్చు. బహుశా డిసెంబర్ 11న ప్రారంభమవుతుందని అంటున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో అయ్యే అవకాశం

ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో అయ్యే అవకాశం

ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ ఆరామ్ కో అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ ఎంత వాటాను విక్రయిస్తుందనే దానిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఈ కంపెనీ వ్యాల్యూను నిపుణులు 1.7 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.1.2 కోటి లక్షల డాలర్లు) వరకు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆరామ్ కో వ్యాల్యూ 2 లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని కూడా అంచనాలు ఉన్నాయి. కేవలం 1 శాతం వాటా విక్రయిస్తే ఐపీఓ సైజ్ దాదాపు 1,500 కోట్ల డాలర్లు అవుతుందని, ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఐపీఓ అవుతుందని అంచనా. 2 శాతం విక్రయిస్తే ఇష్యూ సైజ్ 3,000 కోట్ల డాలర్ల అవుతుందని, ప్రపంచంలో అతి పెద్ద ఐపీఓ అవుతుందని అంచనా.

ప్రస్తుతం టాప్ 5 ఐపీవో కంపెనీలు...

ప్రస్తుతం టాప్ 5 ఐపీవో కంపెనీలు...

ప్రపంచంలో ప్రస్తుతం టాప్ 5 ఐపీవోల్లో అలీబాబా (చైనా) ఇష్యూ సైజ్ 2,500 కోట్ల డాలర్లు, అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా 2,210 కోట్ల డాలర్లు, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా 2,190 కోట్ల డాలర్లు, ఏఐఏ గ్రూప్ (అమెరికా) 2,050 కోట్ల డాలర్లు, వీసా ఇన్ కార్పో (అమెరికా) 1,960 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.

భారీ లాభాల్లో ఆరామ్ కో

భారీ లాభాల్లో ఆరామ్ కో

ఆరామ్ కో సంస్థ గత ఏడాది నికర లాభం 111.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆపిల్, గూగుల్, ఎక్సాన్‌ల ఉమ్మడి లాభాల కంటే దీని లాభాలు ఎక్కువ కావడం గమనార్హం.

English summary

ఐపీవోకు ఆరామ్‌కో: ప్రపంచంలో అతిపెద్ద ఐపీవో, యువరాజు అసంతృప్తి వల్లే... | Saudi Aramco kick starts what could be world's biggest IPO, offers scant details

Saudi Arabia's giant state oil company finally kick-started its IPO on Sunday, announcing its intention to float on the domestic bourse in what could be the world's biggest listing as the kingdom seeks to diversify its economy away from oil.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X