For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rupee Vs Dollar: ఫెడ్ నిర్ణయంతో భారీగా పతనమైన రూపాయి.. పైపైకి ముడి చమురు ధరలు..

|

Rupee Vs Dollar: యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో చేసిన కీలక ప్రకటన కారణంగా డాలర్ మరింతగా బలపడింది. స్టాక్ మార్కెట్ పతనంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా ఈరోజు రికార్డు స్థాయిలో పడిపోయింది.

కొత్త కనిష్ఠాలకు మారకపు విలువ..

వారం ప్రారంభంలోనే మార్కెట్లకు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ చేసిన ప్రకటన పెద్ద కరెక్షన్ కు కారణమైంది. ఈ తరుణంలో ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ఠమైన రూ.80.15కి చేరుకుంది. ఓవర్సీస్‌లో US కరెన్సీ స్థిరపడటం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా కరెన్సీ పతనం కొనసాగుతోంది.

బలపడిన డాలర్..

బలపడిన డాలర్..

ఈ రోజు ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 80.10 వద్ద ప్రారంభమైంది. తర్వాత అది మరింతగా క్షీణించి 80.15కి చేరుకుంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.84 వద్ద ముగిసింది.

ఫెడ్ నిర్ణయాలతో..

ఫెడ్ నిర్ణయాలతో..

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ కఠినమైన వైఖరికి పిలుపునిచ్చిన తర్వాత డాలర్ బలపడిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.86 శాతం పెరిగి 101.86 డాలర్లకు చేరుకుంది.

ఇరాన్ టెన్షన్స్..

ఇరాన్ టెన్షన్స్..

ఆయిల్ US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు 0.83 శాతం పెరిగి 93.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ 0.57 శాతం లాభంతో బ్యారెల్‌కు 101.6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత కొద్ది రోజులుగా ముడిచమురు ధరలో అస్థిరత నెలకొంది. ఇరాన్, పాశ్చాత్య దేశాలు అణు ఒప్పందాన్ని సమీపిస్తున్నట్లు నివేదికల కారణంగా ఇది క్షీణించింది. అయితే సౌదీ అరేబియా నుంచి వచ్చిన ముప్పుతో అది వేగవంతమైంది. OPEC దేశాలు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించవచ్చని సౌదీ అరేబియా పేర్కొంది.

English summary

Rupee Vs Dollar: ఫెడ్ నిర్ణయంతో భారీగా పతనమైన రూపాయి.. పైపైకి ముడి చమురు ధరలు.. | rupee touched record lows with dollar with fed decision to control inflation in us

rupee touched record lows with dollar with fed decision to control inflation in us
Story first published: Monday, August 29, 2022, 16:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X