For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇలాగే ఉంటే డాలర్‌తో రూపాయి 80కి చేరుకోవచ్చు

|

ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత కరెన్సీ రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం మరింత ఎక్కువైతే రూపాయి విలువ ఇంకాస్త పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పరిస్థితులు సానుకూలంగా లేకుంటే డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80ని తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుత ఏడాదిలోనే 77.93 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు. పరిస్థితుల్ ఏమాత్రం సానుకూలంగా లేకపోయినా 82కు చేరినా చేరవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూబుల్ పడి లేచి

రూబుల్ పడి లేచి

అమెరికా-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యన్ రూబుల్ కూడా భారీగా క్షీణిస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు, స్విఫ్ట్ నుండి తొలగింపు వంటి అంశాలు రూబుల్ క్రితం సెషన్లో పది శాతానికి పైగా నష్టపోవడానికి కారణమైంది. అయితే నేడు మాత్రం కాస్త పుంజుకుంది. అంతేకాదు, వ్లాదిమిర్ పుతిన్ తన దేశంలోని కంపెనీలకు ఓ సూచన చేశారు. ఫారెన్ క్రెడిటార్స్‌కు రూబుల్స్‌లో చెల్లింపులు జరపవచ్చునని తెలిపారు. ఈ పరిణామాలు కాస్త సానుకూలంగా మారాయి.

నేడు ఊరట

నేడు ఊరట

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం రూపాయి పైన కూడా పడుతోంది. అందుకే సోమవారం 77.44ని తాకి ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. అయితే నేడు కాస్త పుంజుకుంది. ఉదయం గం.12 సమయానికి 76.88 వద్ద ట్రేడ్ అయింది.

రూపాయి వ్యాల్యూ క్షీణిస్తే దిగుమతి వ్యయాలు పెరుగుతాయి. చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఈ ధరలు పెరిగే అవకాశముంటుంది. అప్పుడు రవాణా భారంగా మారి, వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం డాలర్ల రూపంలో కాస్త ప్రయోజనం ఉంటుంది.

యుద్ధం కొనసాగితే

యుద్ధం కొనసాగితే

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే డాలర్ మారకంతో రూపాయి త్వరలోనే 80కి చేరుకునే ప్రమాదం లేకపోలేదని వివిధ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొన్ని బ్రోకరేజీలు 80 నుండి 82కు చేరుకోవచ్చునని అంటున్నాయి.

English summary

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇలాగే ఉంటే డాలర్‌తో రూపాయి 80కి చేరుకోవచ్చు | Rupee Recoups To 76.73 Per Dollar, Could hit historic low level of Rs 80

The rupee recouped slightly to 76.73 against the dollar on Tuesday after having slumped to a record weak close of 76.93 on Monday, as crude oil prices climbed to multi-year highs driven by the Russia-Ukraine crisis.
Story first published: Tuesday, March 8, 2022, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X