For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశీయ కరెన్సీ పరుగు: వరుసగా బలపడుతున్న రూపాయి, ఎందుకంటే

|

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ ఇటీవల రోజురోజుకు పెరుగుతోంది. నేడు (డిసెంబర్ 31) ఉదయం సెషన్లో డాలర్‌తో రూపాయి వ్యాల్యూ 16 పైసలు లాభపడి 73.15 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 73.31 వద్ద క్లోజ్ అయింది. నేడు ఓ సమయంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడ్ అయింది. ఇది రెండు నెలల గరిష్టం. బుధవారం కూడా డాలర్ మారకంతో 11 పైసలు లాభఫడి 73.31 వద్ద ముగిసింది.

2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్2020లో కంపెనీలకు 568 శాతం లాభం, అయినా భారీగా ఉద్యోగాలు కట్

అమెరికాలో కరోనా ప్రభావం, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ కారణాల వల్ల సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. రూపాయి బలపడటానికి ఇది ప్రధాన కారణం. అలాగే, దేశీయ ఈక్విటీ కూడా కారణం. ఏప్రిల్ 2018 తర్వాత సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.074 శాతం క్షీణించి 89.528కి పడిపోయింది. డాలర్ 90 దిగువకు పడిపోయింది.

Rupee opens 16 paise higher at 73.15 against dollar

అంతేకాకుండా, ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం కలిసి వచ్చింది. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలర్ మారకంతో యువాన్ 6.54ను తాకింది. మరోవైపు, సెప్టెంబర్ నాటికి కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరిందన్న ఆర్బీఐ వెల్లడించడం కలిసి వచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇలాంటి అంశాలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి.

English summary

దేశీయ కరెన్సీ పరుగు: వరుసగా బలపడుతున్న రూపాయి, ఎందుకంటే | Rupee opens 16 paise higher at 73.15 against dollar

Rising for the fifth straight session, the rupee on Wednesday appreciated by 11 paise to close at more than two-month high of 73.31 against the US dollar on the back of foreign fund inflows and a weak greenback in the global markets.
Story first published: Thursday, December 31, 2020, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X