For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాలరుతో నెల రోజుల కనిష్టానికి దిగజారిన రూపాయి

|

డాలరు మారకంతో దేశీయ కరెన్సీ రూపాయి గురువారం బలహీనపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ప్రారంభంలోనే 23 పైసలు నీరసించింది రూపాయి. ఉదయం 71.79 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి 22 పైసలు (0.33 శాతం) క్షీణించి 71.78 వద్ద ట్రేడ్ అయింది. ఇది ఏడు వారాల కనిష్టం. అంతకుముందు జనవరి 8న రూపాయి ఈ స్థాయిలో ట్రేడ్ అయిందని ఫారెక్స్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం కూడా రూపాయి 24 పైసలు క్షీణించింది.

దేశీయ ఈక్విటీ మార్కెట్లో భారీ అమ్మకాలు, విదేశీ మార్కెట్లో అమెరికన్ కరెన్సీని బలోపేతమైన నేపథ్యంలో సాయంత్రానికి అమెరికా డాలర్‌తో రూపాయి మారకం 10 పైసలు క్షీణించి నెల రోజుల కనిష్టంతో 71.64 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ భయాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహాల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు.

Rupee falls to 71.81 against US dollar

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. బుధవారం భారీగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు మాత్రం నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 41,170 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు దిగజారి 12,080 వద్ద ముగిసింది.

English summary

డాలరుతో నెల రోజుల కనిష్టానికి దిగజారిన రూపాయి | Rupee falls to 71.81 against US dollar

The rupee on Thursday declined by 10 paise to settle at a more than one-month low of 71.64 against the US dollar amid heavy selling in domestic equities and strengthening of the American currency in the overseas market.
Story first published: Thursday, February 20, 2020, 20:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X