ముంబై: రూపాయి మారకం విలువ బలపడుతోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు ఉన్నాయంటూ వస్తోన్నవార్తల నేపథ్యంలో భారత రూపాయి మారకం విలువ మరింత పటిష్టమైంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడటం వరుసగా ఇది ఏడో సెషన్. శుక్రవారం నాడు ముగిసిన మార్కెట్ కార్యకలాపాల ప్రకారం.. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ఏడు పైసల మేర క్షీణించింది. 75 రూపాయల వద్ద నిలిచింది.
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ (పీఎఫ్ఐ) అవుట్ ఫ్లో ప్రకారం.. యూఎస్ డాలర్‌తో పోల్చుకుంటే దేశీయ రూపాయి మారకం విలువ ఏడు పైసల మేర తగ్గింది. 75.01 వద్ద నిలిచింది. గురువారం నాటి ముగింపుతో పోల్చుకుంటే.. ఏడు పైసల క్షీణత కనిపించింది. కరోనా వైరస్ ఆవరించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు విక్రయాల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ పరిస్థితి నెలకొందనే అంచనాలు నెలకొన్నాయి.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టాప్ మార్జినల్ ఇన్‌కమ్ ట్యాక్స్‌ను పెంచుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అలాగే- క్యాపిటల్ గెయిన్స్‌పైనా ట్యాక్స్‌ను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పీఎఫ్ఐ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను అమ్ముకుంటున్నారని, దాని ప్రభావం భారత కరెన్సీ బలపడటానికి కారణమైందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గురువారం నాటితో పోల్చుకుంటే- వాల్ స్ట్రీట్ ఇండెక్స్ ఒకశాతం మేర తగ్గింది.
ఇంటర్-బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో భారతీయ రూపాయి 75.02 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు రోజు నాటి క్లోజింగ్ 74.94గా రికార్డయింది. 74.75 నుంచి 75.07 దాకా లావాదేవీలు కొనసాగాయి. అనంతరం దాని క్లోజింగ్ 75.01 వద్ద నిలిచింది. 75.07 నుంచి 75.01కి క్షీణించింది రూపాయి మారకం విలువ. మున్ముందు ఇవే పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదని, ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్-కరెన్సీ విభాగాధిపతి రాహుల్ గుప్తా అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications