For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే లాభాలు: SBI సహా ఈ ఐదింటిలో రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.48,000!

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్ 8, 2004లో లాంచ్ చేసింది. 10 ఏళ్ల కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ పండ్స్‌ల్లో ఇది ముందుంది. గత దశాబ్ద కాలంలో ఇది 17 శాతం CAGRను నమోదు చేసింది. అదే సమయంలో ఈ కేటగిరీలోని 22 ఫండ్స్ సగటు ఇదే కాలంలో 10.97 శాతం మాత్రమే ఉన్నాయి.

Tourist spot: భారతీయులు ఎక్కువగా చూసిన సిటీ హైదరాబాద్,దుబాయ్Tourist spot: భారతీయులు ఎక్కువగా చూసిన సిటీ హైదరాబాద్,దుబాయ్

SBI మ్యూచువల్ ఫండ్

SBI మ్యూచువల్ ఫండ్

SBI మ్యూచువల్ ఫండ్ పోకస్డ్ ఈక్విటీ ఫండ్ అక్షలారా డిసెంబర్ 24, 2009 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ పదేళ్లలో 381 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. అంటే ఈ ఫండ్స్‌లో పదేళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.48,140 రిటర్న్స్ ఇస్తాయి. ఇందులో SIP ఇన్వెస్టర్లు గత పదేళ్లుగా 16.09 శాతం యాన్యువలైజ్డ్ రిటర్న్స్ పొందుతున్నారు.

జెన్ నెక్స్ట్ ఫండ్

జెన్ నెక్స్ట్ ఫండ్

SBI మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్స్‌కు చెందిన జెన్ నెక్స్ట్ ఫండ్ రెండో స్థానంలో ఉంది. దీని CAGR 16.61 శాతంగా ఉంది. మల్టీబ్యాగర్స్ స్టాక్స్ ఏమిటో ముందే పసిగట్టి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్ థిమాటిక్ ఫండ్ ఇది. ఇందులో 2009 డిసెంబర్ 23న రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.46,547 అయ్యేవి.

ఇన్వెస్కో ఇండియా

ఇన్వెస్కో ఇండియా

మూడో స్థానంలో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. ఇది ఈ పదేళ్లలో 329 శాతం రాబడిని అందించింది. ఈ ఫండ్ వార్షిక రాబడి 15.66 శాతంగా ఉంది. ఇది మిడ్ క్యాప్ స్టాక్స్‌లో 58 శాతం, స్మాల్ క్యాప్స్‌లో 20 శాతం, లార్జ్ క్యాప్స్ స్టాక్స్‌లో 10.11 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇందురో డిసెంబర్ 23, 2009లో రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.42,887 అయ్యేవి.

ఫ్రాంక్లిన్ ఇండియా

ఫ్రాంక్లిన్ ఇండియా

నాలుగో స్థానంలో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ఉంది. పదేళ్లలో ఇది 292.92 శాతం రిటర్న్స్ అందించింది. వార్షిక రాబడి 14.66 శాతంగా ఉంది. ఇది మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఈ ఫండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు రాంకో సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, కన్సాయ్ నెరోలాక్ పేయింట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసింది.

డీఎస్పీ మిడ్ క్యాప్

డీఎస్పీ మిడ్ క్యాప్

ఐదో స్థానంలో డీఎస్పీ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. పదేళ్లలో దీని రిటర్న్స్ 292%. డిసెంబర్ 23, 2009లో రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.39,182 అయ్యేవి. వార్షిక రాబడి 14.62 శాతంగా ఉంది. దివీస్ లేబోరేటరీస్, జుబిలాంట్ ఫుడ్ వర్క్స్, ఇప్కా లేబోరేటరీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసింది.

English summary

అదిరిపోయే లాభాలు: SBI సహా ఈ ఐదింటిలో రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.48,000! | Rs 10,000 grew to over Rs 48,000 in SBI Focused Equity Fund in the last decade

SBI Mutual Fund's Focused Equity Fund, launched on October 8, 2004, has emerged as the best equity mutual fund on the basis of the last 10 year return.
Story first published: Wednesday, December 25, 2019, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X