For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ రెండింతలు అయ్యే ఛాన్స్

|

ఉద్యోగుల భవిష్యనిధి (EPFO) పెన్షన్ స్కీమ్ కింద సబ్‌స్క్రైబర్లు చెల్లించే రూ.1000 చాలా తక్కువ అని పార్లమెంటు కమిటీ నిర్ణయించింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకు వెళ్లడం అవసరమని భావించింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని భావించింది. దీంతో ఏడు కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుంది. 2022-23 గ్రాంట్స్ డిమాండ్‌పై పార్లమెంటులో సమర్పించిన నివేదికలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించిన రూ.1000 నెలవారీ పెన్షన్ ఇప్పుడు తక్కువగా ఉందని పేర్కొంది.

EPFOపై ప్రభావం చూపడంతో పాటు ఆధిక సాధికారత పర్యవేక్షణ సిఫార్స్ చేసిన విధంగా తగిన బడ్జెట్ మద్దతు పొందడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖతో ఈ విషయ ప్రస్తావన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు తప్పనిసరి అని ప్యానెల్ పేర్కొంది. సభ్యుడి పెన్షన్ సహేతుకమైన మేరకు పెంచేలా వాస్తవికతను అంచనా వేయడానికి సంప్రదింపులు అవసరమని తెలిపింది.

Rs 1,000 minimum monthly pension for EPFO members inadequate

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 పూర్తి మూల్యాంకనం, సమీక్ష కోసం 2018లో మంత్రిత్వ శాఖ ఒక హై-ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన నివేదికలో మెంబర్/విడో/విడోవర్ పెన్షనర్‌కు చెల్లించాల్సిన కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.2000కు పెంచాలని సిఫార్స్ చేసింది. దీని కోసం వార్షిక బడ్జెట్ కేటాయింపులు చేయాలని అభిప్రాయపడింది.

English summary

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ రెండింతలు అయ్యే ఛాన్స్ | Rs 1,000 minimum monthly pension for EPFO members inadequate

The minimum monthly pension of Rs 1,000 for subscribers of the pension scheme run by retirement fund body EPFO is "grossly inadequate" and it is imperative for the labour ministry to pursue a proposal for raising the amount, a Parliamentary panel said on Tuesday.
Story first published: Friday, March 18, 2022, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X