పెరిగిన సిప్స్, డిసెంబర్ నెలలో 14.20 లక్షలు
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లు పెరిగాయి. 2020 డిసెంబర్ నెలలో ఈ రిజిస్ట్రేషన్లు 14.20 లక్షలకు పైగా పెరిగాయి. సిప్స్ పెరుగుదలలో కొన్ని సాంకేతిక అంశాలు 2020 డిసెంబర్ నెలలో మెరుగైన పనితీరుకు దారితీశాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త SIP పెరుగుదలతో పాటు పెట్టుబడులు కూడా భారీగాపెరిగాయి.
2020 నవంబర్ నెలలో 10 లక్షల ఆరువేల సిప్స్ నమోదు కాగా, డిసెంబర్ మాసంలో 14.20 లక్షలకు పైగా సిప్‌లు నమోదయ్యాయి. ఒక నెలలోనే సిప్‌లు 34 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో నిలిపివేయపడిన సిప్స్ సంఖ్య నవంబర్ నెలలో 7.24 లక్షలు కాగా, డిసెంబర్ నెలలో 7.76 లక్షలకు పెరిగింది. సిప్స్ పెరుగుదలతో మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు నవంబర్ నెలలో రూ.7302 కోట్లు కాగా డిసెంబర్‌లో ఇది రూ.8418 కోట్లు.

ఈక్విటీస్ మార్కెట్లో భారీ పెరుగుదల అనంతరం ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకుంటున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 2020 రెండో అర్ధ సంవత్సరంలో ఈక్విటీ ఫండ్స్ నుండి స్థిర ప్రవాహం చూసింది. 2020లో డీమ్యాట్ ఖాతాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.