For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిమార్ట్ కంటే రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ డబుల్: వాటాదారుల కోసం షేర్ల మార్పిడి స్కీం

|

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ రూ.2.40 వేల కోట్లకు పైగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)లో ఇది నాలుగో వంతు కావడం గమనార్హం. ప్రతిపాదిత షేర్ల మార్పిడి పథకం నేపథ్యంలో ఈ వ్యాల్యూ వెలుగు చూసింది. రిలయన్స్ రిటైల్ వెబ్ సైట్ ప్రకారం రిలయన్స్ రిటైల్ వాటాదారులకు ప్రతి 4 షేర్లకు ఒక RIL షేరు లభిస్తుంది. ఈ లెక్కల ప్రకారమే రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ రూ.2.4 లక్షల కోట్లుగా నిర్ణయించారు. రిలయన్స్ రిటైల్ వెంచర్‌కు రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ. RILకు కూడా ఓ విధంగా అనుబంధ సంస్థనే. రిలయన్స్ రిటైల్ రానున్న అయిదేళ్లలో స్టాక్ ఎక్స్చేంజీలో నమోదవుతుందని చెబుతున్నారు.

'టారిఫ్' రూటుమార్చిన కస్టమర్, దెబ్బతో డిస్కౌంట్ ఆఫర్'టారిఫ్' రూటుమార్చిన కస్టమర్, దెబ్బతో డిస్కౌంట్ ఆఫర్

డిమార్ట్, టెస్కోల కంటే అధిక వ్యాల్యూ

డిమార్ట్, టెస్కోల కంటే అధిక వ్యాల్యూ

దేశంలో అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్, డిమార్ట్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ మార్కెట్ వ్యాల్యూ రూ.1.20 లక్షల కోట్లు. రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ దాని కంటే రెండింతలు (రూ.2.40 లక్షల కోట్లు.) ఇంగ్లాండులో అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ టెస్కో వ్యాల్యూ 3,200 కోట్ల డాలర్లు. దీని కంటే కూడా అధికం కావడం గమనార్హం. జూలై - సెప్టెంబర్‌లో రిలయన్స్ రిటైల్ ఆదాయం 27 శాతం పెరిగి రూ.41,202 కోట్లకు, నిర్వహణ లాభం 66.8 శాతం వృద్ధితో రూ.2,322 కోట్లకు చేరుకుంది.

షేర్ స్వాపింగ్ స్కీం

షేర్ స్వాపింగ్ స్కీం

రిలయన్స్ రిటైల్ 2006, 2007 సంవత్సరాల్లో అర్హత కలిగిన తనఉద్యోగులకు రెండు స్కీమ్స్ కింద షేర్లను జారీ చేసింది. ఈ షేర్ల నుంచి నిష్క్రమించేందుకు లేదా ఈక్విటీ షేర్ల నమోదుకు ఉద్యోగుల నుంచి పలుమార్లు కంపెనీకి విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుతం ఎలాంటి నమోదు ప్రణాళికలు లేకపోవడంతో ప్రతిపాదిత షేర్ స్వాపింగ్ స్కీంను తెచ్చారు.

99.95 శాతం వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ చేతిలో

99.95 శాతం వాటా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ చేతిలో

రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు రిలయన్స్ రిటైల్‌లో 99.95 శాతం వాటు ఉంది. 0.05 శాతం లేదా 25.2 లక్షల షేర్లు ఉద్యోగుల వద్ద ఉన్నాయి. ఈ ప్రతిపాదిత స్కీంకు వాటాదారుల అనుమతిని పొందేందుకు జనవరి 23న వాటాదార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

భారీ లాభాలు

భారీ లాభాలు

దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను రిలయన్స్ రిటైల్ నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఆదాయం గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 89 శాతం వృద్ధి చెంది రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం పెరిగి రూ.5,550 కోట్లుగా ఉంది.

English summary

డిమార్ట్ కంటే రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ డబుల్: వాటాదారుల కోసం షేర్ల మార్పిడి స్కీం | RIL share swap scheme values Reliance Retail at Rs 2.4 lakh crore

Reliance Retail said that it does not have any plan for the listing of its equity shares on the stock exchanges.
Story first published: Friday, December 27, 2019, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X