రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) 43వ ఏజీఎం సమావేశం జూలై 15, బుధవారం జరగనుంది. మొదటిసారి ఆన్‌లైన్ ద్వారా వార్షిక సాధారణ సమావేశం నిర్వహిస్తోంది ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ. ఇందుకు సరికొత్త వర్చువల్ ప్లాట్‌ఫాంను వేదికగా చేస్తోంది. దీని ద్వారా ఒకేసారి 500 ప్రాంతాల నుండి లక్ష మందికి పైగా షేర్ హోల్డర్లు లాగిన్ అయి సమావేశంలో పాల్గొనవచ్చు. ఇప్పటి వరకు ప్రత్యక్ష సమావేశం నిర్వహించేవారు. అప్పుడు బయటి ప్రాంతాల వారు పాల్గొనడానికి ఇబ్బందిగా మారేదు. దీంతో చాలామంది పాల్గొనలేకపోయేవాళ్ళు. ఈసారి ఎక్కడున్నా ఏజీఎం ప్రత్యక్ష ప్రసారానికి లాగిన్ కావొచ్చు.

ఆరామ్‌కో డీల్ ఏమైనా వెల్లడిస్తారా?
ఈ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ ఏం చెబుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఎందుకంటే గత ఏజీఎంలో ఇచ్చిన హామీ కంటే పది నెలల ముందే రిలయన్స్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దారు. కంపెనీ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.1.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించారు. బీపీతో ఇటీవల జాయింట్ వెంచర్ ప్రకటన చేశారు. గత 13 వారాలుగా కరోనా కారణంగా ఎన్నోకంపెనీలు ఇబ్బందుల్లో ఉంటే రిలయన్స్ మాత్రం భారీ మొత్తంలో పెట్టుబడులు సమీకరించింది. ఈ సమావేశంలో దాదాపు ఏడాది కాలంగా వేచి చూస్తున్న ఆరామ్‌కో డీల్ గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ముఖేష్ అంబానీ ఏం చెబుతారు
ఆయిల్ టు కెమికల్ డివిజన్‌లో సౌదీ ఆరామ్‌కోతో డీల్ ఉండనుందని గత ఏజీఎంలో స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. 20 శాతం వాటాతో 15 బిలియన్ డాలర్లు (రూ.1.06 ట్రిలియన్లు)కు ఈ డీల్ ఉండవచ్చునని అంచనా వేశారు. బోనస్ గురించి చెప్పవచ్చు.
ఆరామ్‌కోతో డీల్ గురించి ఈ ఏజీఎంలో ముఖేష్ అంబానీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
జియో ప్లాట్‌ఫాంస్ లిస్టింగ్, జియో ఫైబర్ ట్రాజెక్టరీ, 5G లాంచ్ వంటి అంశాలపై కూడా కీలక ప్రకటన వెలువడవచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితికి అనుకుణంగా మేడిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో రిలయన్స్ పాత్రను వెల్లడించనున్నారు.
జియో మార్ట్ ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడుతారు.
2016 ఏజీఎం సమావేశంలో జియో డిజిటల్ లైఫ్, 2017లో జియో స్మార్ట్ ఫోన్, 2018లో మాన్‌సూన్ హంగామా, జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ వంటివి ప్రకటించారు.
ఇప్పుడు రిలయన్స్ కొత్త ఆవిష్కరణలకు తోడు ఆరామ్‌కో వంటి డీల్స్ గురించి వెల్లడించే అవకాశముంది.

ఏజీఎం ఇష్యూ కోసం చాట్‌బోట్
బుధవారం (15) ఆన్ లైన్ ద్వారా ఏజీఎం నిర్వహిస్తున్నారు. లాగిన్ సహా ఈ ఆన్ లైన్ సమావేశంలో ఎలా పాల్గొనాలో షేర్ హోల్డర్లకు మార్గనిర్దేశనం చేసేందుకు రిలయన్స్ వాట్సాప్ చాట్‌బోట్ లాంచ్ చేసింది. లాగిన్ సహా ఈ ఆన్‌లైన్ సమావేశంలో ఎలా పాల్గొనాలో షేర్ హోల్డర్లకు 79771 11111 వాట్సాప్ నెంబర్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications