For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Retail Inflation: సామాన్యులకు పెద్ద ఊరట.. తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 11 నెలల కనిష్ఠానికి..

|

Retail Inflation: ద్రవ్యోల్బణం భూతం నుంచి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తోంది. నెలలు గడిచే కొద్దీ అదుపులోకి రావటం పెద్ద ఊరటను అందిస్తోంది. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దీంతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ఠానికి చేరుకున్నట్లు వెల్లడైంది.

ఆర్బీఐ ప్రకారం..

ఆర్బీఐ ప్రకారం..

వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.88 శాతానికి తగ్గినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ముందు అక్టోబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో ద్రవ్యోల్బణం రేటు 4.91 శాతంగా ఉంది.

ఆహార వస్తువుల ధరలు..

ఆహార వస్తువుల ధరలు..

మార్చి 2026 వరకు ద్రవ్యోల్బణం రేటు 2 నుంచి 6 శాతానికి మించి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి తెలిపింది. కానీ.. నవంబర్ నెలలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు 6.40 శాతంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. నవంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 4.67 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం సీపీఐ బుట్టలో దాదాపు సగానికిపైగా ఉంది. అక్టోబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదైంది. గ్లోబల్ కమోడిటీ, ఆహార ధరల్లో తగ్గుదల ద్రవ్యోల్బణం తగ్గడానికి దారితీసిందని నిపుణులు చెబుతున్నారు.

11-నెలల కనిష్ఠానికి..

11-నెలల కనిష్ఠానికి..

జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ సౌకర్యవంతమైన ఆరు శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉంది. అయితే నవంబర్ మాసంలో అది 11 నెలల కనిష్ఠ స్థాయికి దిగజారింది. డిసెంబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతంగా ఉంది. గత వారం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్‌బీఐ కీలకమైన పాలసీ రేటైన రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచటంతో అది 6.25 శాతానికి చేరుకుంది. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ తగ్గినప్పటికీ.. సామాన్యులకు రుణాల చెల్లింపులు భారంగా మారాయి.

క్షీణించిన ఉత్పత్తి..

క్షీణించిన ఉత్పత్తి..

పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు సైతం ఇదే క్రమంలో విడుదలయ్యాయి. అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) నాలుగు శాతం క్షీణించి అందరినీ నిరాశపరిచింది. దేశంలోని తయారీ రంగంలో ఉత్పత్తి తగ్గడం, మైనింగ్, ఇంధన ఉత్పత్తిలో బలహీన వృద్ధి కారణంగా ఈ క్షీణత ఏర్పడింది. అక్టోబర్ 2021లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.2 శాతం పెరిగింది. అక్టోబర్, 2022లో తయారీ రంగం ఉత్పత్తి 5.6 శాతం తగ్గిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెల్లడించింది. సమీక్షా కాలంలో మైనింగ్ ఉత్పత్తి స్వల్పంగా 2.5 శాతం, విద్యుత్ ఉత్పత్తి 1.2 శాతం మేర తగ్గాయి.

Read more about: cci inflation retail inflation rbi
English summary

Retail Inflation: సామాన్యులకు పెద్ద ఊరట.. తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. 11 నెలల కనిష్ఠానికి.. | Retail inflation fell to 11 months low in november but industrial production decreased

Retail inflation fell to 11 months low in november but industrial production decreased
Story first published: Tuesday, December 13, 2022, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X