For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో టీవీ+, జియో గ్లాస్ లాంచ్: ప్రత్యేకతలు ఇవే..

|

రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో టీవీ ప్లస్, జియో గ్లాస్‌లను ఆవిష్కరించింది. ఈ రోజు(జూలై 15, బుధవారం) మధ్యాహ్నం 2గంటలకు రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ సమావేశం సందర్భంగా కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీలు వీటిని ఆవిష్కరించారు. ఇషా అంబానీ జియో మార్ట్ ఫీచర్స్ పైన మాట్లాడారు.

భారత ఎగుమతుల్లో రిలయన్స్‌దే హవా, గూగుల్ భారీ పెట్టుబడి: ముఖేష్ అంబానీభారత ఎగుమతుల్లో రిలయన్స్‌దే హవా, గూగుల్ భారీ పెట్టుబడి: ముఖేష్ అంబానీ

జియో గ్లాస్ ప్రత్యేకతలు

జియో గ్లాస్ ప్రత్యేకతలు

రిలయన్స్ గ్లాస్ పేరుతో కొత్త ఆవిష్కరణ చేశామని రిలయన్స్ ప్రకటించింది. దీని ద్వారా టీవీ ప్రసారాలాల్లో సరికొత్త అనుభూతులు అందిస్తామన్నారు. జియో గ్లాస్ బరువు 75 గ్రాములు ఉంటుంది. జియో గ్లాస్‌కు 25కు పైగా సాంకేతిక కార్యక్రమాల అనుసంధానం ఉందని తెలిపింది. జియో గ్లాస్‌తో టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాలింగ్‌లో సరికొత్త విప్లవం తీసుకు వస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియో గ్లాస్ ద్వారా డిజిటల్ తరగతుల నిర్వహణలో సరికొత్త సేవలు అందితాయని తెలిపింది. సింగిల్ కేబుల్‌తో అనుసంధానించవచ్చు.

జియో మీట్

జియో మీట్

సురక్షితమైన, చవకైన వీడియో కాన్ఫరెన్స్ యాప్‌గా జియో మీట్ ఉంటుందని తెలిపింది. జియో మీట్ ద్వారా అపరిమిత సేవలు అందుకోవచ్చునని తెలిపింది. విద్యారంగంలోని ఎన్నో సమస్యలకు జియో మీట్ ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపింది. ఆరోగ్య సేవల రంగంలోను జియో మీట్ సరికొత్త విప్లవం తీసుకువస్తుందన్నారు. హైక్వాలిటీ వీడియో కాల్స్ కోసం జియో మీట్ సమర్థవంతంగా సేవలు అందిస్తుందని రిలయన్స్ తెలిపింది. వైద్యుల వీడియో కన్సల్టేషన్ సేవలకు జియో మీట్‌తో ఎంతో ప్రయోజనం అని తెలిపింది.

జీయో టీవీ ప్లస్

జీయో టీవీ ప్లస్

జియో టీవీ ప్లస్‌లో 12 ఓటీటీ కార్యక్రమాలు ఉంటాయని, ప్రధాన ఛానల్స్ అన్నీ జియో టీవీ ప్లస్‌లో చేర్చామని రిలయన్స్ తెలిపింది. జియో ఫైబర్ ద్వారా టీవీ ప్రసారాల్లో కొత్త ఒరవడి తీసుకు వచ్చామని తెలిపింది. సెట్ టాప్ బాక్సులోని యాప్ స్టోర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉంటాయని తెలిపింది. సెట్ టాప్ బాక్సులో ఏ యాప్ డెవలప్ అయినా తమ యాప్స్ పెట్టుకోవచ్చునని తెలిపింది. ఆ యాప్స్ సేవల ద్వారా ఆదాయం కూడా పొందవచ్చునని పేర్కొంది.

English summary

రిలయన్స్ జియో టీవీ+, జియో గ్లాస్ లాంచ్: ప్రత్యేకతలు ఇవే.. | Reliance unveils Jio TV+, Jio Glass

JioGlass weighs only 75 grams, offers best in class, immersive mixed reality services. Remains connected by a single-cable and already has 25 apps that allow augmented reality video meetings and more. Jio TV+ will curate OTT platforms such as Netflix, Amazon Prime Video and Hotstar, among others, into one app. It will be voice-search enabled.
Story first published: Wednesday, July 15, 2020, 15:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X