For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 500 కంపెనీల్లో రిలయన్స్ ముందు, తెలంగాణ నుండి 29 కంపెనీలు

|

కరోనా పరిస్థితుల్లోను ఈ ఏడాది భారత్‌లోని అగ్రగామి 500 కంపెనీల నికర వ్యాల్యూ సగటున 68 శాతం పెరిగినట్లు బర్గండీ ప్రయివేటు హూరున్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 500 కంపెనీల మొత్తం నికర వ్యాల్యూ రూ.228 లక్షల కోట్లు. ఇది భారత జీడీపీ కంటే ఎక్కువ. ఏడాదిలో ఈ కంపెనీల వ్యాల్యూ రూ.90 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో 200 కంపెనీల వ్యాల్యూ రెండింతలు పెరిగింది. ఈ కంపెనీల విక్రయాలు రూ.58 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం జీడీపీలో 26 శాతానికి సమానం. ఇందులోని ప్రభుత్వరంగ కంపెనీలను మినహాయిస్తే 69 లక్షల మందికి లేదా మొత్తం దేశవ్యాప్త సిబ్బందిలో 1.5 శాతానికి ఈ కంపెనీలు ఉపాధిని కల్పిస్తున్నాయి.

హైదరాబాద్‌లో 29 కంపెనీలు

హైదరాబాద్‌లో 29 కంపెనీలు

స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానీ కంపెనీల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాల్యూ అత్యధికంగా ఉంది. దీని వ్యాల్యూ రూ.1.8 లక్షల కోట్లు. కరోనా ఏడాదిలో ఈ కంపెనీ వ్యాల్యూ 127 శాతం పెరిగింది. దేశంలోని 43 నగరాల్లో టాప్ 500 కంపెనీలు ఉన్నప్పటికీ, ఒక్క ముంబైలో 167సంస్థలు ఉన్నాయి. బెంగళూరులో 57, చెన్నైలో 38 ఉన్నాయి. తెలంగాణనుండి 29 కంపెనీలు ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఆర్థిక సేవల విభాగంలో అత్యధికంగా 77 కంపెనీలు ఉన్నాయి. జాబితాలోని మొత్తం కంపెనీలు రూ.1.9 లక్షల కోట్ల ఆదాయపు పన్ను కట్టాయి. 19 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి.

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీలు

టాప్ 10 విషయానికి వస్తే రూ.16.65 లక్షల కోట్లతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్ (రూ.13.09 లక్షల కోట్లు), HDFC బ్యాంకు (9.05 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (7.51 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంకు (5.37 లక్షల కోట్లు), HDFC (5.01 లక్షల కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (4.31 లక్షల కోట్లు), కొటక్ మహీంద్రా (4.17 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్ (3.85 లక్షల కోట్లు), విప్రో (3.67 లక్షల కోట్లు)గా ఉంది.

తెలంగాణ నుండి..

తెలంగాణ నుండి..

2021 బర్గండ్రీ ప్రయివేటు హూరున్ ఇండియా 500 కంపెనీల్లో తెలంగాణ నుండి 29 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీల మొత్తం వ్యాల్యూ రూ.6.9 లక్షల కోట్లు. ఇందులో అత్యంత విలువైనదిగా దివిస్ ల్యాబ్స్ నిలిచింది. ఈ కంపెనీ వ్యాల్యూ రూ.1.36 లక్షల కోట్లు. రెండో స్థానంలో హిందూస్తాన్ జింక్, మూడో స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ఉంది. 29 కంపెనీల్లో ఆరు కంపెనీల వ్యాల్యూ ఈ ఏడాది రెట్టింపు అయింది. ఇందులో 15 కంపెనీలు హెల్త్ కేర్ రంగానికి చెందినవి.

English summary

టాప్ 500 కంపెనీల్లో రిలయన్స్ ముందు, తెలంగాణ నుండి 29 కంపెనీలు | Reliance tops ‘2021 Burgundy Private Hurun India' list, 29 from Telangana

The 500 companies were ranked according to their value, defined as market capitalisation for listed companies and valuations for non-listed companies.
Story first published: Friday, December 10, 2021, 20:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X